సత్తుపల్లి మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు

సత్తుపల్లి, ఆంధ్రప్రభ : ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపాలిటీ కార్యాలయంలో మంగళవారం ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కార్యాలయం గేట్లు మూసివేసి, లోపలికి ఎవరినీ అనుమతించకుండా కానిస్టేబుళ్లు గస్తీ కాస్తున్నారు.

కార్యాలయం లోపల ఏం జరుగుతోంది, ఏ అంశాలపై తనిఖీలు జరుగుతున్నాయి అనే విషయాలను అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. దీంతో స్థానికంగా ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంది.

మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు జరుగుతుండటంతో పట్టణంలోని ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా అధికారులు కనిపించడం లేదని ప్రజలు గుసగుసలాడుతున్నారు.

మార్చి నెల కావడంతో ఇవి సాధారణ తనిఖీలేనా? లేక మరేదైనా కారణమా? అన్న అనుమానాలతో పట్టణ ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు.

Leave a Reply