RTC| ఏలూరు (కార్పొరేషన్) ఆంధ్రప్రభ : విజయవాడ ఆటోనగర్ బస్ డిపోకు చెందిన ఆర్టీసీ లగ్జరీ బస్సు (RTC luxury bus) కు తృటిలో ప్రమాదం తప్పింది. ఏపీ 16 జెడ్ 0611 నెంబర్ గల ఆర్టీసీ లగ్జరీ బస్సు రాజమండ్రి (Rajahmundry) వైపు నుంచి ఏలూరు వస్తుండగా ఏలూరు (Elur) జూట్ మిల్ వంతెన వద్ద అదుపుతప్పి వంతెన గోడను ఆదివారం అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఢీ కొట్టింది. ఆ సమయంలో బస్సులో దాదాపు 15 మంది ప్రయాణికులున్నారు. ఎవరికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
RTC| త్రుటిలో తప్పిన ప్రమాదం..

