fair | ఘనంగా గుట్టల మల్లన్న జాతర..

fair | ఘనంగా గుట్టల మల్లన్న జాతర…
- పాల్గొన్న మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి
fair | మేడ్చల్, ఆంధ్రప్రభ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ సర్కిల్ లో భాగంగా ఈరోజు గిర్మాపూర్ లో జరిగిన గుట్టల మల్లన్న స్వామి వారి జాతర ఆవరణలో మేడ్చల్ నియోజకవర్గ శాసనసభ్యుడు చామకూర మల్లారెడ్డి మాట్లాడుతూ… నా ఇంటి పేరు మల్లన్న.. మా తాత పేరు మల్లన్న.. మా నాన్న పేరు మల్లన్న… నా పేరు మల్లన్న… నా మనవడి పేరు మల్లన్న నేను ఇష్టంగా, దైవంగా పూజించే దేవుడు కొమరవెల్లి మల్లన్న స్వామి అని కొనియాడారు.

ఈ సందర్భంలో చామకూర మల్లారెడ్డి మాట్లాడుతూ… గుట్టల మల్లన్న రోడ్ల నిర్మాణం నిర్మించాను, కళ్యాణ మండపం కోసం చైర్మన్తో మాట్లాడి కమ్యూనిటీ హాల్ నిర్మాణం కూడా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్ భాస్కర్ యాదవ్, చీర్ల దయానంద్, గోపాల్ రెడ్డి, సందీప్ గౌడ్, ఆకిటి నవీన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
