Started | హీరోయిన్ పాయల్ రాజ్ పుత్, అనసూయ సందడి

Started | నాయుడుపేట, ఆంధ్రప్రభ : తిరుపతి జిల్లా నాయుడుపేటలో సినీ హిరోయిన్ పాయల్ రాజ్ పుత్, అనసూయ సందడి చేశారు. నాయుడుపేట పట్టణంలో ఏర్పాటు చేసిన అతిపెద్ద న్యూ మైత్రి షాపింగ్ మాల్ ను హీరోయిన్ పాయల్ రాజ్ పుత్, అనసూయ ప్రారంభించారు. నిర్వాహుకులు మహేష్, మోహిత్, యుగంధర్ వారికి స్వాగతం పలికి సత్కరించారు. యువత పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో సందడి వాతావరణం నెలకొంది.
