distribution | ఆప్తా సహకారంతో..

distribution | చల్లపల్లి, ఆంధ్రప్రభ : చల్లపల్లి నారాయణరావు నగర్ కాలనీకి చెందిన మేదరబోయిన నాగ బాబ్జీ కుటుంబానికి ఆప్తా సహకారంతో ఈనెల సరుకులు, బియ్యం అందజేశారు. ఆప్తా తరఫున సహాయ కార్యక్రమాలు 2025 నవంబర్ నెల నుండి కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చల్లపల్లి దాస్ పాల్గొని ఆ కుటుంబానికి సరుకులు పంపిణీ చేసి ఆప్తా సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో చల్లపల్లి పిఏసిఎస్ చైర్మన్, చల్లపల్లి టౌన్ జనసేన అధ్యక్షులు బొందలపాటి వీరబాబు, చల్లపల్లి మండల బీజేపీ అధ్యక్షులు అడపా రవి, జనసేన నాయకులు సూదాని నందగోపాల్, మిరియాల జితేంద్ర, కలపాల ప్రసాద్, గోళ్ళ ప్రసాద్, నల్లమోతు వీరయ్య, సింగంశెట్టి రవికుమార్, కూటమి నాయకులు రావి రాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply