kyathanpally | చైనా మాంజా”ను అమ్మితే కఠిన చర్యలు తప్పవు

kyathanpally | చైనా మాంజా”ను అమ్మితే కఠిన చర్యలు తప్పవు
- పట్టణ ఎస్ఐ, ఎల్ , భూమేష్.
kyathanpally | క్యాతన్ పల్లి, ఆంధ్రప్రభ : రామకృష్ణాపూర్ లోని పలు దుకాణాలను ఈ రోజు తనిఖీలు చేశారు. ఈ సందర్బంగా ఎస్, ఐ, భూమేష్ బి-జోన్ సెంటర్, రాజీవ్ చౌక్ లో గల దుకాణ దారులతో మాట్లాడి “చైనా మాంజా దారంను” ప్రభుత్వం నిషేధించినదని, గతంలో పంతాగులు ఎగిరేసే సమయంలో “చైనా మాంజా దారం” వాడటం వలన చాలామంది ప్రజలు, వాహనదారులు గాయాలపాలయ్యారనీ, కొంతమంది ప్రాణాలు సైతం పోగొట్టుకున్నారన్నారు. రాబోవు సంక్రాంతి పండగ సందర్బంగా రామకృష్ణాపూర్ పట్టణoలోనీ దుకాణ యజమానులు ఎట్టి పరిస్థితుల్లో “చైనా మాంజా దారం” అమ్మవద్దని హెచ్చరించారు. పట్టణంలోనీ యువకులు, పిల్లలు పంతాగులు ఎగిరేసే సమయంలో ఎవరు “చైనా మాంజా దారం” వాడకూడదని, పండగను ప్రశాంతంగా, సుఖసంతోషాల మధ్యలో భద్రంగా జరుపుకువాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై పాటుగా పట్టణo లోని పలు దుకాణ యజమానులు, యువకులు, హెడ్ కానిస్టేబుల్ జంగు, ఓంకార్ పాల్గొన్నారు.
