MukkotiEkadashi| దేవతలకు ధనుర్మాసం బ్రాహ్మీ ముహూర్త కాలం

MukkotiEkadashi| దేవతలకు ధనుర్మాసం బ్రాహ్మీ ముహూర్త కాలం
అనంతమైన కాలం.. భగవత్ స్వరూపం. ప్రాచీనులు కాలాన్ని నాలుగు ప్రమాణాలతో సూచించారు. “మాస చతుర్థా… సావనః సౌర చాంద్రో నాక్షత్ర ఇతి” అని నిర్ణయ సింధులో పేర్కొబడింది. సావనము, సౌరము, చాంద్రము, నక్షత్రము ద్వారా గణించడం పరిపాటి. చైత్ర వైశాఖ మాసములు, ప్రతిపద విధియాది తిథులు చాంద్ర – మానం ప్రకారం లెక్కిస్తారు. చాంద్రమానం ప్రకారం పౌర్ణమి నాడు చంద్రుడున్న నక్షత్రాన్ని బట్టి మాస నిర్ణయం చేయగా, సూర్యుడు ఒక్కొక్క రాశిలో ప్రవేశించి ఉండే నెల రోజులు సౌరమానం ప్రకారం మాసంగా గణిస్తారు. సౌర మాన మాసాలు ఆయా ఇంగ్లీషు తేదీలను పోలి, అధికంగా ఆయా తేదీలలోనే వస్తాయి. అందుకే తమిళులకు ఏప్రిల్ 14ననే మేషారంభమై సంవత్సరాది వస్తుంది. నాగర ఖండ ఆధారంగా “రవే: సంక్రమణం రాశా సంక్రాంతి రిధి కథ్యతే”.
ఒక్కొక్క మాసము ఒకొక్క సంక్రాంతిగా చెప్పబడుతుంది. మకర సంక్రాంతి జనవరి 14 నుండి కర్కాటక సంక్రాంతి జూలై 16వరకు ఉత్తరా యణం, తదాది మరల మకర సంక్రాంతి వరకు దక్షిణాయనంగా చెప్పబడిం ది. సౌర కాలమానం ప్రకారం ధనుస్సంక్రమణమైన మాసం దేవతలకు ఉషఃకాలం. “బ్రాహ్మీ ముహూర్తే బుద్ధత ధర్మారౌ చాను చింతయేత్” అని స్మృతి చెపుతున్నది. దేవతలకు ధనుర్మాసం బ్రాహ్మీ ముహూర్త కాలం. మహా విష్ణువు ఆషాఢం మొదలుకుని, కార్తీకం వరకు నిద్రించి, సూర్యుడు ధను రాశిలో ప్రవేశించాక, విష్ణు సంబంధ శ్లోకాలచే మేల్కొలిపి అరుణోదయంలో ఉషఃకాల షోడశోపచార పూజలు చేసి, పులగం-పొంగలి శర్కర నివేదించాలి. నిర్ణయ సింధుకారుని ప్రకారం ఉదయానికి పూర్వం నాలుగు ఘడియలు, ఘడియ అనగా ఇరువై నాలుగు నిమిషాలు – గంటన్నరపై ఆరు నిమిషాలకు పూర్వము అరుణోదయం అగును. ధనుర్మాసము సౌరమానము యొక్క ప్రామాణికానుసారము కాగా, శుక్ల ఏకాదశి చాంద్రమాన మైన తిథి. ప్రతి మాసమునందలి ఏకాదశులు ఎంతో పవిత్రమైనవి. “గృహస్థో బ్రహ్మచారీ చధైవచః ఏకాదశాంశ భుంజిత పక్ష యోరు భయోరపి” అని అగ్ని పురాణా దులు వివరిస్తున్నాయి. గృహస్తులకు, బ్రహ్మచారులకు, నిత్యాగ్ని హోత్రులకు నైమిత్తిక ఉపవాసాద్యాచరణము విధించబడినది. ఇట్టి ఏకాదశి విష్ణుమూర్తి కి అత్యంత ప్రీతికరమైన రోజు కావునే ఏకాదశి హరి వాసరముగా కొనియాడబడుచున్నది.

అందు సౌరమానము నందలి ప్రశం ఏమైన ధనుర్మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశి (మార్గశీర్షము లేక పుష్యమాసం) వైకుంఠ ఏకాదశిగా పిలువబడుచున్నది. సూర్యచంద్రులు నేత్రములుగా కలిగిన వైకుంఠవాసునికి సౌర, చాంద్రమానాలలో ప్రశస్తమైన ధనుర్మా శుక్ల పక్ష ఏకాదశి అత్యంత ప్రీతికరమైనది. “ధనూరాశి స్థితే సూర్యే శుక్ల ఏకాదశి తిధౌబీ త్రింషత్ కోటి దసురైః సాకం బ్రహ్మ వైకుంఠ మాగతః పాలస్త్యేనని పీడితాః సురగణాః వైకుంఠలోకం యయుః ద్వారే తత్ర విషాద భావ మనసా సూక్ష్మర్ హరిం తుష్టువుః శుకైః శ్రీః హరి వాసరే ప్రభాత సమయే భానౌ ధనుః సంస్థితే, తేభ్యోదాత్ సుఖ దర్శనం కరుణయా నారాయణో మాధవః”… రావణుని బాధలను తాళలేని దేవతలు బ్రహ్మను ఆశ్రయింపగా… ఆ దేవుడు ధనుర్మాస శుక్ల ఏకాదశి దిన మున దేవతలందరితో వైకుంఠమును చేరి, హరి వాసరమునందు దేవతలు విషాదభావ మనస్కులై శ్రీహరిని వేదోక్తం గా స్తుతించగా, వారికి శ్రీహరి సుఖ దర్శనమును కలుగజేసెనని వివరించబడి నది. శ్రీప్రశ్న సంహిత (5) నందు గల ఐతిహ్యము ననుసరించి మధు కైటభులను భగవానుడు సంహరించినపుడు వారు దివ్య రూపధారులై దివ్య జ్ఞానము పొందగా, బ్రహ్మాదులెవరైనను నీలోకము వంటి మందిరమును నిర్మించి, ఏకాదశి దినోత్సవమును గావించి, నిన్ను నమస్కరించి ఉత్తర ద్వార మార్గమున సమీపింతురో వారికి వైకుంఠ ప్రాప్తి కలుగునట్లు దీనిని “మోక్షోత్సవ దినము”గా వరమిచ్చినట్లు తెలియుచున్నది.
ముక్కోటి దేవతల బాధలను నివారించినందున “ముక్కోటి ఏకాదశి”గాను, వైకుంఠ దర్శనము కలిగించునది కనుక “వైకుంఠ ఏకాదశి” గాను, భగవద్దర్శనము చేయు పవిత్ర దినమైనందున “భగవదవలోక దివ సము”గా కొనియాడబడుచున్నది. ధనుర్మాస ఏకాదశి కొన్నిసార్లు మార్గశిర మాసమందు, మరికొన్ని మారులు పుష్యమాస మందు రావడం చేత రెండు మాసాల శుక్ల ఏకాదశులు ప్రశస్తములైనవే. మార్గశిరమాస ఏకాదశిని “మో క్షైకాదశి” అని, పుష్యమాస ఏకాదశిని ‘పుత్రదైకాదశి, రైవత మన్వాది దినమ”ని పిలుస్తారు. కృతయుగంలో చంద్రవతీ నగరాన్ని ఏలిన మురుడనే రాక్షస సంహార సమయాన, విష్ణు దేహం నుండి ఉత్పన్నమైన స్త్రీమూర్తియే ఏకాదశి కనుక ఏకాదశికి అధిదేవతయైన ఏకాదశీదేవి మహావిష్ణు అంశయే. సూర్యుడు ధనురాశి పై నుండగా వచ్చిన తొలి ఏకాదశి (వైకుంఠ పుణ్యదినాన తన దివ్యమంగళ రూపంతోవైకుంఠ ద్వారం వద్ద దేవతలకు శ్రీమహావిష్ణువు దివ్యదర్శనంగావించిన సందర్భంగా, కోటి తేజోమూర్తిని దర్శించిన బ్రహ్మాది దేవతలు, సనకసనందాది మునులు, “పశ్యన్ నిముష మాత్రేన కోటి యజ్ఞంఫలం లభేత్” అని వచించినట్లు బ్రహాండ పురాణంలో వర్ణించబడింది. ఈ పవిత్రదినాన ఆలయాలలో ఉత్తర ద్వారం వద్ద సూర్యోదయానికి పూర్వమే స్వామి దర్శనం చేసుకోవడం సత్సాంప్రదాయం.
రామకిష్టయ్య సంగనభట్ల
“మో క్షైకాదశి” అని, పుష్యమాస ఏకాదశిని ‘పుత్రదైకాదశి, రైవత మన్వాది దినమ”ని పిలుస్తారు. కృతయుగంలో చంద్రవతీ నగరాన్ని ఏలిన మురుడనే రాక్షస సంహార సమయాన, విష్ణు దేహం నుండి ఉత్పన్నమైన స్త్రీమూర్తియే ఏకాదశి కనుక ఏకాదశికి అధిదేవతయైన ఏకాదశీదేవి మహావిష్ణు అంశయే. సూర్యుడు ధనురాశి పై నుండగా వచ్చిన తొలి ఏకాదశి (వైకుంఠ పుణ్యదినాన తన దివ్యమంగళ రూపంతోవైకుంఠ ద్వారం వద్ద దేవతలకు శ్రీమహావిష్ణువు దివ్యదర్శనంగావించిన సందర్భంగా, మహావిష్ణువు దివ్యదర్శనంగావించిన సందర్భంగా,
కోటి తేజోమూర్తిని దర్శించిన బ్రహ్మాది దేవతలు, సనకసనందాది మునులు, “పశ్యన్ నిముష మాత్రేన కోటి యజ్ఞంఫలం లభేత్” అని వచించినట్లు బ్రహాండ పురాణంలో వర్ణించబడింది. ఈ పవిత్రదినాన ఆలయాలలో ఉత్తర ద్వారం వద్ద సూర్యోదయానికి పూర్వమే స్వామి దర్శనం చేసుకోవడం సత్సాంప్రదాయం.“మో క్షైకాదశి” అని, పుష్యమాస ఏకాదశిని ‘పుత్రదైకాదశి, రైవత మన్వాది దినమ”ని పిలుస్తారు. కృతయుగంలో చంద్రవతీ నగరాన్ని ఏలిన మురుడనే రాక్షస సంహార
