Breaking |బీజేపీ ఆఫీసు వద్ద టెన్షన్.. టెన్షన్..

Breaking |బీజేపీ ఆఫీసు వద్ద టెన్షన్.. టెన్షన్..

Breaking | హైదరాబాద్, ఆంధ్రప్రభ : హైదరాబాద్ నగరంలోని బీజేపీ కార్యాలయం (BJP office) వద్ద టెన్షన్..టెన్షన్ వాతావరణం నెలకొంది. బీజేపీ కార్యాలయం ముట్టడికి కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు. బీజేపీ కార్యాలయానికి వెళ్లే మార్గాన్ని పోలీసులు మూసివేశారు. అన్ని వైపులా బారికేడ్లతో బందోబస్తు ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్ శ్రేణులు వస్తే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు.

కేంద్ర ప్రభుత్వం (Central Government) ఉపాధి హామీ పథకంలో సంచలన మార్పులు చేయనుంది. ఈ పథకం పేరును మార్చుతూ పార్లమెంట్‌లో కొత్త బిల్లును ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో నగరంలోని బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Leave a Reply