Hat Trick | ఒకే కుటుంబానికి ప‌ట్టం..

Hat Trick | ఒకే కుటుంబానికి ప‌ట్టం..

  • ఒకే కుటుంబానికి దక్కుతున్న నచ్చన్ ఎల్లాపూర్ సర్పంచ్ పదవి
  • గ్రామానికి చేసిన అభివృద్ధి పనులే ఆదర్శం
  • నచ్చన్ ఎల్లాపూర్ హ్యాట్రిక్ సర్పంచ్ గా బొడ్డు గంగన్న కుటుంబం రికార్డు

Hat Trick | కడెం, ఆంధ్రప్రభ : కడెం మండలంలోని నచ్చన్ ఎల్లాపూర్ గ్రామపంచాయతీ సర్పంచ్ గా మూడు సార్లు ఒకే కుటుంబానికి చెందిన కుటుంబ సభ్యులు వరుసగా గెలుపొందుతూ హ్యాట్రిక్ సాధించారు. గ్రామానికి చెందిన బొడ్డు గంగన్న 2013 సంవత్సరంలో మొదటిసారి పంచాయతీ ఎన్నికల్లో మొదటిసారి తన తల్లి బొడ్డు చిన్న రాజవ్వ రాజు సర్పంచ్ బరిలో దిగ‌గా.. 27 ఓట్ల మెజార్టీతో సర్పంచ్ గా గెలుపొందారు. రెండవసారి 2019వ‌ సంవత్సరంలో నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో బొడ్డు గంగన్న గ్రామ సర్పంచ్ ప‌ద‌వి బరిలో దిగి అఖండ మెజార్టీతో గెలుపొందారు. ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో మొదటి విడత మండలంలోని నచ్చన్ ఎల్లాపూర్ గ్రామానికి చెందిన బొడ్డు గంగన్న మాజీ సర్పంచ్ భార్య బొడ్డు రాజేశ్వరి స్పందన కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచి 25 ఓట్ల మెజార్టీతో గ్రామ సర్పంచ్ గెలుపొందారు. ఇలా వరుసగా మూడుసార్లు గ్రామ సర్పంచ్ కైవసం చేసుకుని హ్యాట్రిక్ సాధించిన బొడ్డు గంగన్న కుటుంబ సభ్యులకు ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, నాయకులు, యువకులు, మహిళలు అభినందించారు.

చేసిన గ్రామ అభివృద్ధితో వరుస విజయాలు…..

మండలంలోని నచ్చన్ ఎల్లాపూర్ గ్రామపంచాయతీ సర్పంచ్ గా వరుసగా మూడుసార్లు ఒకే కుటుంబం సర్పంచ్ పదవులను అందుకుంటున్న బొడ్డు గంగన్న కుటుంబం సర్పంచ్ గా క్రమశిక్షణతో బాధ్యతాయుతంగా సర్పంచ్ విధులు నిర్వహిస్తూ నిస్వార్థంగా గ్రామ పంచాయ‌తీ ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటూ సేవలందిస్తూ పలు అభివృద్ధి పనులు చేపడుతూ ప్రభుత్వం నుండి పలు అవార్డులు అందుకున్నారు. గ్రామ పంచాయ‌తీలో పచ్చదనం, పారిశుధ్యం, పాలనాపరమైన అంశాల్లో ప్రగతి సాధించి జిల్లా స్థాయి ఉన్నతాధికారులు ప్రశంసలు పొంది జిల్లా ఉత్తమ గ్రామపంచాయతీ అవార్డును కూడా బొడ్డు గంగన్న పొందడం జరిగింది. హ్యాట్రిక్ పదవి కట్టబెట్టిన జీ.పీ. లోని గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ నచ్చన్ ఎల్లాపూర్ గ్రామ పంచాయ‌తీని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ‌ బొజ్జు సహకారంతో అన్ని రంగాలలో మరింత అభివృద్ధి చేస్తామని ఇటీవల నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్ బొడ్డు రాజేశ్వరి స్పందన గంగన్నలు పేర్కొన్నారు.

Leave a Reply