Bheengal Town | సర్పంచ్ అభ్యర్థికి విరాళాల వెల్లువ
Bheengal Town | భీంగల్ టౌన్ / రూరల్, ఆంధ్రప్రభ : నిస్వార్థంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టి ప్రజాసేవ చేసేందుకు వచ్చిన సర్పంచ్ అభ్యర్థికి గ్రామానికి చెందిన కొందరు స్వచ్చందంగా విరాళాలు అందజేస్తున్నారు. మండలంలోని పల్లికొండ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మారిపెద్ది మీనా, గణేష్ ఇవాళ గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈసందర్బంగా గ్రామానికి చెందిన బుస్కన్నోళ్ల ( గంధం ) గంగాధర్ సర్పంచ్ అభ్యర్థి మీనాకు రూ.10,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి విరాళాలు అందజేస్తున్న గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు. సర్పంచ్ గా తనను గెలిపిస్తే ప్రజలకు నిస్వార్థంగా సేవ చేస్తానని పేర్కొన్నారు. ప్రజాసేవ తప్పా స్వార్థం కోసం పనిచెయ్యనని స్పష్టం చేశారు. తనను ఆదరించి ప్రజలు విలువైన ఓటును ఫుట్ బాల్ గుర్తుకు వేసి విజయం అందించాలని కోరారు. ప్రచారంలో యువకులు, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
