Airport | ఇండిగో విమానం రద్దు
Airport | గన్నవరం, ఆంధ్రప్రభ : ముంబై నుంచి గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి (Airport) ఆదివారం సాయంత్రం 5:55 గంటలకు చేరుకోవాల్సి ఉన్న ఇండిగో విమాన సేవ 6E 6456ను పలు కారణాల వల్ల రద్దు చేసినట్లు విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. ప్రయాణీకులకు ముందస్తుగా సమాచారమిచ్చి ప్రత్యామ్నాయ ఏర్పాట్లను సూచించామని చెప్పారు. ఈ రద్దుతో కొంతమంది ప్రయాణీకులు అసౌకర్యానికి గురయ్యారు.

