Raghavapur | జిల్లా కోర్టు స్థలాన్ని పరిశీలించిన హైకోర్టు న్యాయమూర్తి
Raghavapur | పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : పెద్దపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని రాఘవాపూర్ జిల్లా కోర్టు నూతన భవన నిర్మాణం కోసం కేటాయించిన స్థలాన్ని శనివారం హైకోర్టు న్యాయమూర్తి లక్ష్మినారాయణ సందర్శించారు. ఈసందర్భంగా సర్వే నెం.1072లో కేటాయించిన పది ఎకరాల స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. స్థలం వివరాలు, భవన నిర్మాణాలకు కేటాయించిన నిధులను స్థానిక న్యాయమూర్తులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట హైకోర్టు జడ్జిలు పుల్ల కార్తీక్, శ్రీనివాసరావు, జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి సునిత కుంచాల, ఆర్డీవో గంగయ్య, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లకిడి భాస్కర్, నాయవాదులు ఉన్నారు.

