Ward Member | బుంగ‌మూతులు.. బుజ్జగింపులు

Ward Member | బుంగ‌మూతులు.. బుజ్జగింపులు

Ward Member | బీబీపేట, ఆంధ్రప్రభ : బీబీపేట మండల వ్యాప్తంగా రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్(Notification) విడుదల చేయడంతో బీబీపేట మండ‌లంలోని అన్ని గ్రామ పంచాయితీల పరిధిలో 10 రోజుల నుంచి ఎన్నికల కోలాహలం నెలకొంది. ఈ సందర్భంగా స‌ర్పంచ్ స్థానాలకు నామినేషన్లలో బరిలో నిలిచిన అభ్యర్థులు తమకు వ్యతిరేకంగా పోటీలో ఉన్నవారిని నామినేషన్లను ఉపసంహరించుకోవాల‌ని కోరుతున్నారు.

వారిని బుజ్జ‌గించే ప‌నిలో నిమ‌గ్న‌మ‌య్యారు. పోటీలో ఉన్న బలమైన అభ్యర్థులు తమ సన్నిహితుల ద్వారా, సర్పంచి, వార్డు మెంబర్(Ward Member) స్థానాలకు తమకు వ్యతిరేకంగా బరిలో ఉన్న వారిని నామినేషన్లు ఉపసంహరించుకోవడానికి బుజ్జగింపులు పర్వానికి తెర‌లేపారు.

బీబీపేట మండల వ్యాప్తంగా 11 గ్రామపంచాయతీలకు 38 మంది సర్పంచ్ అభ్యర్థులుగా నామినేషన్ వేశారు. అదేవిధంగా బీబీపేట మండల వ్యాప్తంగా ఉన్న 110 వార్డు మెంబర్ స్థానాలకు 275 మంది(275 people) ఆశావాహులు తమ వార్డు మెంబర్లుగా నామినేషన్లు దాఖలు చేశారు. ఇదిలా ఉండగా ఈ సంవత్సరం భారీ స్థాయిలో సర్పంచ్ స్థానాలతో పాటు, వార్డు మెంబర్ స్థానాలకు సైతం భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖల య్యాయి.

దీంతో ప్రధాన పార్టీల ఆశీర్వాదం ఉన్న అభ్యర్థులు తీవ్ర ఆందోళన గురవుతున్నారు. రిజర్వేషన్లు(Reservation) కలిసి వచ్చి నామినేషన్లు సైతం వేసి ప్రచారాన్ని ప్రారంభిస్తున్న క్రమంలో తమకు వ్యతిరేకంగా మిగతా అభ్యర్థులు నామినేషన్లు వేయడంపై ఆందోళ‌న చెందుతున్నారు. దీనివ‌ల్ల ఓట్ల చీలిక జరిగి ఫలితాలు తారుమారయ్యే పరిస్థితి ఉంది. ఎలాగైనా నామినేషన్లు వేసిన వారిని ఉపసంహరించుకోవాల‌ని కోరుతున్నారు.

Click Here to Read More కమీషన్ల దాదా MBBS

Click Here to Read More

Leave a Reply