Kotia War | కొటియా కొట్లాట
- సుప్రీం కోర్టు స్టేటస్ కో ఉల్లంఘన
- నిత్యం ఒడిశా నిఘా
- నిరంతరం ఏపీ మౌనం
- పౌర సేవలకు బ్రేకులు
- ఆఫీసర్లకు అవమానాలుకిమ్మనని కూటమి సర్కారు
Kotia War | ( సాలూరు రూరల్, ఆంధ్ర ప్రభ) ఒడిశా సర్కారు తీరు మారలేదు. స్టేటస్ కో ప్రాంతం పై ఏక పక్షంగా వ్యవహరిస్తోంది. ( Kotia war ) దౌర్జన్యానికి అడ్డులేదు. సుప్రీం కోర్టు ఆదేశాలను ( Suprem Court Orders Disobey ) సైతం బేఖాతరు చేస్తోంది.

పౌర సేవల్లో పాల్గొనే ఏపీ అధికారులను తరచూ అడ్డుకోవడం సర్వసాధారణమైంది. ఏపీ సిబ్బంది పై దౌర్జన్యమే (Violance) కాదు.. సెల్ ఫోన్లను గుంజుకొంటున్నారు. ఎప్పటికప్పుడు ఇదే పరిస్థితి నెలకొనటంతో.. వివిధ మండలాల అధికారులు తీవ్ర అవమానాలు (Insults) ఎదుర్కొంటున్నారు.
ఇంత జరుగుతున్నా (Not Respoming) ఆంధ్రా పాలకులకు చీమ కుట్టటం లేదు. నిమ్మకు నీరెత్తిన రీతిలో పెదవి విప్పటం లేదు. ఇక జిల్లా అధికారుల తీరు వర్ణనాతీతం. అంతరంగం ఎవరికి అర్థం కాదు.
Kotia War |అవమానాలే అవమానాలు

గత బుధవారం మండలానికి చెందిన వ్యవసాయ శాఖ సిబ్బంది ఏపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రైతన్న మీ కోసం కార్యక్రమంలో భాగంగా గిరిజనులను (Tribes ) ఆధునిక వ్యవసాయం పట్ల అవగాహన పెంచేందుకు కొటియా (Kotia Villages) గ్రూపు గ్రామాల్లోని ఎగువ మెండంగి వెళ్లారు.

అంతలోనే ఒడిశా అధికారులు మూకుమ్మడిగా ప్రత్యక్షం ( Odisha Officials) అయ్మారు. ఏపీ అధికారులను (Blocked Ap Officials) అడ్డుకున్నారు. ఇక్కడికి రావటానికి వీలులేదు, వెనక్కి వెళ్ళిపోవాలి అని గద్దించారు. అప్పటి వరకు ఏపీ అధికారులు సెల్ ఫోన్లలో సేకరించిన డేటాను డిలీట్ చేయించారు. ఇక చేసేది లేక ఏపీ అధికారులు బిక్కమొహంతో సాలూరు చేరుకున్నారు.

సాలూరు మండల వ్యవసాయ శాఖ అధికారులకు ఈ విషయం చెప్పారు. తహపీల్దార్ నీలకంఠ రావుకి సాలూరు ఏవో శిరీష పిర్యాదు చేసారు. గత 24న కొటియా గ్రామాల్లో వైద్య సేవలు అందించేందుకు తన సిబ్బందితో 104 వాహనం పై వెళ్లిన తోణాం వైద్యాధికారి అజయ్ ను ఒడిశా అధికారులు అడ్డుకున్నారు. ఇలా వెళ్లిన ఏపీ అధికారులను అడ్డుకొని వెనక్కి పంపించటం మొదటిసారి కాదు.

గతంలో జిల్లా కలెక్టర్, ఐటీడీఏ ప్రాజెక్టు డైరెక్టర్, డ్వామా పీడీలను కూడా అడ్డుకున్నారు. అక్కడితో ఆగలేదు, దిగువ శంబి (Shambi Area Fenced) రైతులు సాగు చేస్తున్న భూమలను స్వాధీనం చేసుకుని, కొండ చుట్టూ కంచె వేశారు. ధూళి భద్రలో ఏపీ ప్రభుత్వం మంచి నీటి రిజర్వాయర్ నిర్మిస్తుండగా.. ఒడిశా అధికారులు అడ్డుకున్నారు. పని ముట్లు పట్టుకు పోయారు, ప్రాజెక్టు కార్మికులను అరెస్టు చేశారు.
Kotia War : కొటియా నిత్యం ఘర్షణే

కొటియా గ్రామాల్లో చీమ చిటుక్కుమన్నా తమకు తెలిసేలా ఒడిశా అధికారులు తగిన ఏర్పాట్లు చేసుకున్నారు. వివాదస్పద గ్రామాల్లో ఏపీ అధికారులు అడుగు పెట్టేసరికి ఎంత దూరంలో ఉన్నప్పటికీ రెండు, మూడు వాహనాల్లో (Three Vehicles) పొట్టంగి తహసీల్దార్, సమితి బీడీవో, పోలీసులు రయ్ రయ్ మంటూ దూసుకు వచ్చేస్తారు.
అక్కడితో ఆగరు. ఒరియా భాషలో బూతుల పంచాగం అందుకుంటారు. వినలేని రీతిలో కసురుకుంటారు. గద్దిస్తారు. అవాకులు చవాకులు పేలుతారు. గత బుధవారం పొట్టంగి తహసీల్దార్ దేవేంద్ర దరువా, బీడీవో రామ చంద్ర నాయక్, ఎన్ఆర్జీఎస్ సిబ్బంది, పోలీసుల బృందం హుటాహుటిన చేరుకుంది.
అక్కడి ఏపీ వ్యవసాయ శాఖ సిబ్బందిని అడ్డుకున్న తీరు గమనిస్తే .. సాలూరు సిబ్బంది ఎదుర్కొన్న అవమానకర మానసిక పరిస్థితి అర్థం కాగలదు. ఇటువంటి ఘటనలు ఎన్ని జరుగుతున్నా Srikakulamg Officials) జిల్లా యంత్రాంగంలో మాత్రం చలనం లేదు. ఇవీ జనం నోట వినిపిస్తున్న విమర్శలు.
Kotia War | ఒడిశా దూకుడే దూకుడు

ఒడిశా ప్రభుత్వం తరచూ తమ ప్రతినిధులను, రాష్ట్ర స్థాయి అధికారులను పంపిస్తుండగా.. ఒడిశా అధికారులు ఆయా గ్రామాల్లో పర్యటించి, ప్రజలతో మాట్లాడుతూ ఆకట్టు కుంటున్నారు. అక్కడితో ఆగకుండా నూతన వ్యవసాయ విధానం వైపు గిరిజన రైతులు దృష్టి సారించేలా చేస్తూ, అవసరమైన సహాయ, సహకారాలను అందిస్తున్నారు. స్టాబెర్రీ (Srawberry crop) వంటి పంటలు పండిస్తున్నారు.
అంటే అది వారి కృషే అని చెప్పక తప్పదు. ఈ ఒక్క ఏడాదిలో ఒడిశా రెవెన్యూ కార్యదర్శి, ఒడిశా డిప్యూటీ సీఎం (Odisha Dy.Cm) తో పాటు పలువురు మంత్రులు పలు మార్లు వచ్చి, ఆయా గ్రామాల్లో పర్యటించి ప్రజలతో మాట్లాడారు. అంటే కొఠియా గ్రామాల విషయంలో ఒడిశా అధికారులు ఎంత నిబద్ధతతో ఉన్నారో తెలుస్తుంది.
Kotia War | ఏపీ పాలకుల్లో స్పందన అడక్కూడదు

ఈ విషయంలో ఏపీ పాలకులు, ఉన్నత స్థాయి అధికారులు ఎందుకు స్పందించటం లేదో అటుబట్టడం లేదు. చర్యకు ప్రతి చర్య ఉంటే తప్ప పనులు జరిగే అవకాశం లేదని తెలిసి, తమ సిబ్బందిని పంపించటం, అక్కడ అడ్డుకుంటే వెనక్కి రావడం, గత కొన్నేళ్లుగా ఇదే తంతు సాగుతోంది. గత ప్రభుత్వంలో మాజీ డిప్యూటీ సీఎం (Ex Dy.Cm) రాజన్న దొర కొటియా సమస్యలపై తరచూ స్పందించారు.

కాగా, ఈ కూటమి ప్రభుత్వం (NDA ) మాత్రం పట్టించుకున్న దాఖలాలు లేవు. ప్రస్తుత గిరిజన సంక్షేమ శాఖ మంత్రి (Tribes Welfare Minister) సంధ్యారాణి ఒడిశా ముఖ్యమంత్రితో కొటియా (Kotia War) వివాదం కోసం మాట్లాడానని చెప్పిన వారంలోనే వ్యవసాయ శాఖ సిబ్బందిని అడ్డుకున్నారంటే ఇక్కడి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి ఒడిశా ప్రభుత్వంతో చర్చలు జరిపి వివాదస్పద గ్రామాల్లో స్టేటస్ కో అమలు అయ్యేలా చూడాల్సి ఉంది.
ఏపీ పాలకులు, ఉన్నత స్థాయి అధికారులు ఎందుకు స్పందించటం లేదో అటుబట్టడం లేదు. చర్యకు ప్రతి చర్య ఉంటే తప్ప పనులు జరిగే అవకాశం లేదని తెలిసి, తమ సిబ్బందిని పంపించటం, అక్కడ అడ్డుకుంటే వెనక్కి రావడం, గత కొన్నేళ్లుగా ఇదే తంతు సాగుతోంది. గత ప్రభుత్వంలో మాజీ డిప్యూటీ సీఎం (Ex Dy.Cm) రాజన్న దొర కొటియా సమస్యలపై తరచూ స్పందించారు.

