COLLECTOR| ఎన్నికల నిబంధనలు పాటించాలి
- నామినేషన్ల పరిశీలన
- పెద్దముద్దునూరు కేంద్రాన్ని సందర్శించన కలెక్టర్
COLLECTOR| నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : నాగర్ కర్నూల్ జిల్లాలోని 7 మండలాల్లో రెండో దశ గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను (The nomination process) అత్యంత పకడ్బందీగా సజావుగా జరిగేలా చూడాలని, నామినేషన్ స్వీకరణ కేంద్రాల్లోకి ముగ్గురి కంటే ఎక్కువ అనుమతించవద్దని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదేశించారు.
ఇవాళ ఉదయం రెండో దశ గ్రామపంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ల రెండో రోజులో భాగంగా నాగర్ కర్నూల్ (Nagar Kurnool) మండలంలోని పెద్ద ముద్దునూరు గ్రామపంచాయతీ కార్యాలయంలో పెద్ద ముద్దునూరు, చందుబట్ల, గన్యాగుల గ్రామాల పరిధిలోని సర్పంచులు వార్డు సభ్యుల (Ward members) నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ గ్రామపంచాయతీ ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాలను సందర్శించారు.
జిల్లా కలెక్టర్ బదవత్ సంతోష్ మాట్లాడుతూ… జిల్లాలోని గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ స్వీకరణ ప్రక్రియ ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా, సజావుగా నిర్వహించాలని రిటర్నింగ్ అధికారులను (Returning officers) ఆదేశించారు. నామినేషన్ స్వీకరణ కేంద్రాల్లో ఓటర్ జాబితాను ప్రదర్శించాలని సూచించారు. అన్ని నామినేషన్ స్వీకరణ కేంద్రాల్లో ఫారం 1 ప్రచురణ చేశారా లేదా అని కలెక్టర్ తనిఖీ చేశారు.
ప్రతిరోజూ నామినేషన్లను స్వీకరించిన అనంతరం సాయంత్రం టీ పోల్ (Tea poll) యాప్ లో అప్డేట్ చేయాలని సూచించారు. నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థితో పాటు ఒక ప్రపోజర్, మరొకరు లేదా ఇద్దరు మాత్రమే రిటర్నింగ్ అధికారి గదిలోకి అనుమతించాలని సూచించారు. జిల్లా కలెక్టర్ వెంట తహసీల్దార్, ఇతర అధికారులు తదితరులు ఉన్నారు.

