Telangana | నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన ట్రైని అదనపు కలెక్టర్
Telangana | మామడ, ఆంధ్రప్రభ : మండల కేంద్రంతో పాటు పొన్కల్ గ్రామంలోని నామినేషన్ కేంద్రాన్ని శుక్రవారం ట్రైని అదనపు కలెక్టర్ ఎల్లందుల రాకేష్ (Ellandula Rakesh) పరిశీలించారు. నామినేషన్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పొన్కల్ ఉన్నత పాఠశాలను సందర్శించి 10వ తరగతి విద్యార్థులకు పలు సూచనలు చేశారు. విద్యార్థులు (students) కష్టపడి చదువుకొని ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ మెహరాజ్, పంచాయతీ కార్యదర్శులు మంగేష్, రాజేశ్వర్ రెడ్డి, కళ్యాణి, అశ్విత, అనసూయ,సుజాత, మోహన్, సిబ్బంది ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

