Yadadri | చెక్ పోస్టుల వద్ద పటిష్ట నిఘా

Yadadri | చెక్ పోస్టుల వద్ద పటిష్ట నిఘా
ఎన్నికల అధికారి హనుమంతరావు
Yadadri | ఆంధ్రప్రభ, ప్రతినిధి /యాదాద్రి : గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో చెక్ పోస్ట్ ల వద్ద పటిష్ట నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంత రావు (Collector Hanumantha Rao) అన్నారు. శుక్రవారం బీబీనగర్ టోల్ గేట్ వద్ద గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఏర్పాటుచేసిన ఎస్ ఎస్ టి టీం చెక్ పోస్ట్ ను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ (Sudden inspection) చేశారు.

చెక్ పోస్ట్ వద్ద ఎంతమంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.24 గంటలు చెక్ పోస్ట్ వద్ద విధులు నిర్వహించాలని అన్నారు. పోలీస్, రెవిన్యూ సిబ్బంది (Police and Revenue personnel) అప్రమత్తంగా ఉంటూ ప్రతి వాహనాన్ని ఆపి వీడియో రికార్డ్ చేస్తూ క్షుణ్ణంగా తనిఖీ చేయాలి అన్నారు.ఎట్టి పరిస్థితుల్లో విధుల్లో నిర్లక్ష్యం చేయడానికి వీలులేదని అన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
