MLA | విద్యుత్ స్థంభాలు వేయాలని ఆదేశాలు..

MLA | విద్యుత్ స్థంభాలు వేయాలని ఆదేశాలు..
MLA | జూబ్లీహిల్స్, ఆంధ్రప్రభ : ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్న కరెంటు సమస్యలను వెంటనే పరిష్కరించాలని జూబ్లీహిల్స్ శాసనసభ్యులు వల్లాల నవీన్ యాదవ్ విద్యుత్ అధికారులను ఆదేశించారు. ఈ రోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని యూసుఫ్ గూడా డివిజన్ కృష్ణానగర్లో ఎమ్మెల్యే నవీన్ యాదవ్ పర్యటించారు.
పర్యటనలో భాగంగా మజీద్-ఏ-జాహోర్-ఏ-కరీం(Majeed-e-Zahor-e-Karim) మజీద్ దగ్గర ఇబ్బందికరంగా ఉన్న ట్రాన్స్ఫారం(ransform)ను అలాగే కింద పడిపోయేలా ప్రమాదకరంగా ఉన్న ఐదు లైట్ స్తంభాలను మార్చి కొత్త స్తంభాలను వేయాలని విద్యుత్ అధికారులకు ఎమ్మెల్యే సూచించారు..
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు విద్యుత్ అధికారులు పర్యటించిన A.D బాలకృష్ణ, A.E పీటర్, .. F.M యాదయ్య ..ADE గోపి పాల్గోని సమస్యాత్మకంగా ఉన్న పనులను త్వరలోనే పూర్తి చేస్తామని అన్నారు.

