Mudhol | షార్ట్‌సర్య్కూట్‌తో…

Mudhol | షార్ట్‌సర్య్కూట్‌తో…
ఓ ఇల్లు దగ్దం
Mudhol | ముధోల్, ఆంధ్రప్రభ : ముధోల్ (Mudhol) మండల కేంద్రంలో విద్యుత్ షార్ట్‌సర్య్కూట్‌తో ఓ ఇల్లు దగ్ధమైంది. గ్రామానికి చెందిన గడ్డం రమేష్ కుటుంబసభ్యులు వ్యవసాయ పనుల నిమిత్తం బయటకువెళ్లారు. అంతలోనే విద్యుత్ షార్ట్‌సర్య్కూట్ ( short circuit) తో ఇంట్లో నిప్పంటుకుంది. ఇంట్లో ఉన్న బీరువాలో సామాన్లు, వస్తువులు, తినుబండరాలు, దుస్తులు పూర్తిగా దగ్ధమయ్యాయి.

సంఘటన స్థలాన్ని ఎస్.ఐ బిట్ల పెర్సిస్ చేరుకున్నారు. గ్రామస్థులు గమనించి నీటితో మంటలను చల్లార్చారు. అనంతరం భైంసా నుంచి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది (Firefighters) మంటలను పూర్తిగా ఆర్పివేశారు. ఇల్లు పూర్తిగా దగ్ధం కావడంతో గడ్డం రమేష్ కుటుంబం కట్టుబట్టలతో బయటే ఉన్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు కోరారు.
