Vijayawada | స్ట్రీట్ ఫైట్..

Vijayawada | స్ట్రీట్ ఫైట్..
విజయవాడ, ఆంధ్రప్రభ : విజయవాడ అజిత్ సింగ్ నగర్ ప్రాంతంలోని రామ్ నగర్ జి ప్లస్ త్రీ అపార్ట్మెంట్స్ వద్ద విద్యార్థులు (Students) గ్యాంగ్ వార్ ను తలపించే విధంగా స్ట్రీట్ ఫైట్ చేశారు. గత పది రోజులు క్రితం నుండి ఓ అమ్మాయి గురించి రెండు వర్గాలు చెందిన విద్యార్థులు ఘర్షణ పడుతున్నట్లు విద్యార్థులు వెల్లడించారు. సింగ్ నగర్ మాకినేని బసవ పున్నయ్య మున్సిపల్ స్టేడియంలో ముందుగా విద్యార్థులు చేరుకొని కర్రలు, రాళ్లు తీసుకొని గుంపులుగా రామనగర్ జి ప్లస్ త్రీ అపార్ట్మెంట్స్ నిర్మానుష ప్రాంతానికి చేరుకున్నారు. జి ప్లస్ త్రీ అపార్ట్మెంట్ ప్రాంతంలో నివాసాలు లేకపోవడంతో ఆ ప్రాంతంలో స్ట్రీట్ ఫైట్ కి దిగారు. ఓ ప్రైవేటు పాఠశాలలకు చెందిన కొంతమంది విద్యార్థులు ఆ ప్రాంతంలో భయాందోళనకారమైన వాతావరణాన్ని సృష్టించారు.
చదువుకోవలసిన వయసులో విద్యార్థులు స్ట్రీట్ ఫ్రైట్ లకు పాల్పడ్డారని.. భయనక వాతావరణాన్ని సృష్టించారని స్థానికులు చెబుతున్నారు. గత వారం రోజుల నుండి ఈ ప్రాంతంలో గొడవలు జరుగుతున్నాయని.. గుంపులు గుంపులుగా.. ఏర్పడి రౌడీషీట్ల, బ్లేడ్ బ్యాచ్ సభ్యులను పిలిపించి సెటిల్మెంట్లు చేసుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ (Police Station) పరిధిలోని రౌడీషీటర్లు, గంజాయి బ్యాచ్ సభ్యులు రోజురోజుకీ పేట్రేగిపోతున్నారని స్థానిక ప్రజలు తెలిపారు. ఇప్పటికే పలుమార్లు పోలీసులకు సమాచారం తెలిపినా.. ఫలితం లేకుండా పోతుందని స్థానికులు తెలియచేశారు. పోలీసు పెట్రోలింగ్ నామమాత్రముగా జరుగుతుందననే.. ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. విద్యార్థులకు కౌన్సిలింగ్ నిర్వహించి ఇలాంటి ఘటనలకు పునరావృతం కాకుండా అధికారులు అదే విధంగా స్కూల్ ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

