Integral development | సమ‌ష్టి కృషితోనే సమగ్రాభివృద్ధి సాధ్యం


జిల్లా అభివృద్ధిలో ఉద్యోగుల ప్రాత కీలకం
జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ

Integral development | విజయవాడ, ఆంధ్రప్రభ : సమ‌ష్టి కృషితోనే సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని జిల్లా అభివృద్ధిలో ఉద్యోగులు అందిస్తున్న సహకారం మరువలేనిదని ప్రజలకు పారదర్శకమైన సేవలందించి ప్రభుత్వ లక్ష్యాలను సాధించడంలో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తిచేసుకున్న సందర్భంగా ఏపీ ఎన్‌జీజీవో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డి.సత్య‌నారాయణ రెడ్డి, సహాధ్యక్షుడు వేమూరి ప్రసాద్, కార్యదర్శి డి.రమేష్ (D. Ramesh) నగర అధ్యక్షులు సీవీఆర్ ప్రసాద్ ఆధ్వర్యంలో జిల్లా, నగర కార్యవర్గ సభ్యులు మంగళవారం జిల్లా కలెక్టర్ విడిది కార్యాలయంలో జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ జిల్లాలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు విజయవంతం కావ‌డంలో ఉద్యోగులు అందిస్తున్న సహకారం మరువలేనిదన్నారు. ప్రభుత్వం (Govt) ప్రజల భాగస్వామ్యంతో సుస్థిరాభివృద్ధి సాంధించే దిశగా అడుగులు వేస్తుందన్నారు. జిల్లాలో వ్యవసాయ పారిశ్రామిక పర్యాటక సేవారంగాల్లో వార్షికవృద్ధి లక్ష్య సాధనకు సమ‌ష్టి కృషి అవసరమన్నారు. స్వర్ణాంధ్ర, వికసిత్ భారత్ లక్ష్యాల‌ను సాధించేందుకు మరింత కృషిచేయాలన్నారు. సంక్షేమానికి, అభివృద్ధికి సమ ప్రాధాన్యమిస్తూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చడంలో ఉద్యోగుల భాగస్వామ్యం కీలకమన్నారు. జిల్లాలో ఏడాదిగా సాధించిన విజయాలు అధికారులు, ఉద్యోగుల సమన్వయంతో సాధ్యపడిందని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఉద్యోగులకు ఎదుర‌య్యే స‌మ‌స్య‌ల‌ను త‌మ దృష్టికి తీసుకొస్తే వాటిని త్వ‌రిత‌గిన ప‌రిష్క‌రించ‌డంలో ఎప్పుడూ ముందుంటాన‌ని భ‌రోసా క‌ల్పించారు.

ఏపీ ఎన్జీవో అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు డిఎస్ఎన్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తూ ప్రజల క‌లెక్ట‌ర్‌గా పేరు తెచ్చుకోవడం ఉద్యోగులకు గర్వకారణం అన్నారు. ఏ పి ఎన్జిజిఒ రాష్ట అధ్యక్షుడు విద్యాసాగర్ నేతృత్వం లో ఉద్యోగులు పారదర్శకత, నిబద్ధతతో సేవలందిస్తూ జిల్లా యంత్రాంగం అప్పగించిన బాధ్యతలను పూర్తిస్థాయిలో నిర్వర్తించేందుకు ఉద్యోగులూ ఎల్లప్పుడు సిద్దంగా ఉంటారన్నారు. జిల్లా కలెక్టర్‌ను (District Collector) కలిసిన వారిలో ఏపీ ఎన్జీవో అసోసియేషన్ జిల్లా కార్యవర్గ సభ్యులు వీ.వీ. ప్రసాద్, పి.రమేష్, బి.సతీష్ కుమార్, ఎం.రాజుబాబు, డి.విశ్వనాథ్, బీవీ రమణ, రామకృష్ణ, మహిళా ప్రతినిధి కె.శివలీల, నగర కార్యవర్గ సభ్యులు సీవీఆర్ ప్రసాద్, ఎస్ కే న‌జీరుద్దీన్, వి.రాజశేఖర్, దిలీప్ కుమార్, కె.మధుసూదనరావు, శ్రీనివాసరావు, విజయశ్రీ, సాగర్, రవి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply