CHECK | మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం

- మహిళా ప్రగతితోనే తెలంగాణ ప్రగతి
- ఇందిరా మహిళా శక్తి చీరలు, కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
CHECK | నర్సంపేట, ఆంధ్రప్రభ : మహిళలు ప్రగతి సాధిస్తేనే తెలంగాణ రాష్ట్రం ప్రగతి సాధిస్తుందని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. నర్సంపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, కలెక్టర్ డాక్టర్ సత్యశారదతో కలిసి ఆదివారం ఇందిరా మహిళా శక్తి చీరలు, కల్యాణలక్ష్మి చెక్కులు అందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకొని మహిళలు తమకు అనుభవం, నైపుణ్యం ఉన్నరంగాలను ఎంచుకొని ఆర్థికంగా బలోపేతం కావాలని సూచించారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం అనేక పథకాలను రూపొందించి అమలు చేస్తున్నట్లు తెలిపారు.
డివిజన్‌లోని అన్ని మండలాలకు చేసిన 317 మంది లబ్ధిదారులకు రూ.3 కోట్ల 17 లక్షల విలువైన కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ రాంరెడ్డి, ఏపీడీ రేణుకాదేవి, నర్సంపేట మార్కెట్ కమిటీ ఛైర్మెన్ పాలయి శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్ రమణారెడ్డి, తహసీల్దార్లు పాల్గొన్నారు.
