MISSION BHAGIRATHA | ఆరు రోజులుగా నీటి సరఫరా బంద్

ఆరు రోజులుగా నీటి సరఫరా బంద్
MISSION BHAGIRATHA | ఆరు రోజులుగా నీటి సరఫరా బంద్జుక్కల్ (కామారెడ్డి జిల్లా), ఆంధ్రప్రభ : జుక్కల్ మండల కేంద్రంలో మిషన్ భగీరథ పథకం నుంచి ఆరు రోజులుగా తాగు నీటి సరఫరా నిలిచిపోయింది.దీంతో స్థానిక ప్రజలు అవస్థలు పడుతున్నారు. గ్రామస్తులు కిలో మీటర్ల దూరంలో గల మహాదేవునిగుడి దగ్గర ఉన్న బోర్ బావి నుంచి తాగునీరు తెచ్చుకుంటున్నారు.
కొందరు పంట పొలాల వ్యవసాయ బావుల నుండి తాగునీటిని తెచ్చుకుంటున్నారు. పైపుల లికేజ్ పేరిట సంబంధిత అధికారులు కాలయాపన చేయటంతో తాగునీటికి ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. తక్షణమే నీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
