HKU5-Cov2 | చైనాలో కొత్త వైరస్..
- గబ్బిలాల్లో గుర్తించిన పరిశోధకులు
- జంతువుల నుంచి మనుషులకు వ్యాప్తి
చైనాలో మరో కొత్త వైరస్ వెలుగులోకి వచ్చింది. గబ్బిలాలలో ఈ వైరస్‌ను గుర్తించిన పరిశోధకులు… ఇది కోవిడ్ తరహా వైరస్ అని నిర్ధారించారు. జంతువుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందుతుందని తేల్చారు.
గబ్బిలాల్లో గుర్తించిన ఈ వైరస్‌కు హెచ్‌కేయూ5-కోవ్-2గా పేరు పెట్టారు. ఇది కొవిడ్19కి కారణమైన సార్స్-కోవ్2 మాదిరిగా ఉందని పరిశోధనల్లో తేలింది.
ఈ వైరస్ మెర్బెకోవైరస్తో పాటు ప్రాణాంతక మెర్స్-కోవ్ ఉప రకానికి చెందినదిగా పరిశోధకులు తేల్చారు. దీనిని హెచ్‌కేయూ5 కరోనా వైరస్ సంతతికి చెందినదిగా వెల్లడించారు. ఈ వైరస్‌ను తొలుత హాంకాంగ్‌లోని జపనస్ పిపిస్ట్రెల్ రకం గబ్బిలాలలో గుర్తించారు. అయితే, ఈ వైరస్ ప్రభావం కొవిడ్‌తో పోల్చితే తక్కువేనని వెల్లడించారు.