CHILDREN| ఘనంగా బాలల హక్కుల దినోత్సవం

CHILDREN| ఘనంగా బాలల హక్కుల దినోత్సవం

CHILDREN| నెల్లూరు ప్రతినిధి, ఆంధ్రప్రభ: నెల్లూరు దర్గామిట్టలోని జడ్పీ హైస్కూల్ లో గురువారం జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయైన జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ సాధికారిక అధికారిణి బీహేనా సుజన్ జ్యోతి ప్రజ్వలన ప్రారంభించారు. అనంతరం సుజన్ జ్యోతి మాట్లాడుతూ.. ఈ రోజు పిల్లలందరికీ ఎంతో ముఖ్యమైన రోజని.. చిన్నారులు సమాజానికి, దేశానికి విలువైన సంపదని అన్నారు. భావి పౌరులైన వీరి భద్రత, సంరక్షణ, అభివృద్ధికి అందరం ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు.

బాల్యం ఆనందంగా సాగేలా చర్యలు తీసుకోవడంతో పాటు పిల్లల్లో నేర్చుకోవాలి, ఎదగాలనే తపన కలిగించే వాతావరణాన్ని కల్పించాలన్నారు. ప్రభుత్వాలతో సహా ప్రతి ఒక్కరూ బాలల సంక్షేమానికి పెద్దపీట వేయాలనే లక్ష్యంతో ఏటా నవంబరు 20న అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం నిర్వహిస్తారని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేయడంతో పాటు వారికి ఉన్న హక్కుల గురించి సమాజానికి తెలియజేయడం ఈ రోజు ముఖ్య ఉద్దేశంమని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది పిల్లలు నేటికీ విద్య, ఆరోగ్యం, ఆనందమయ జీవితాన్ని పొందడంలో తమ హక్కులను కోల్పోతున్నట్లు యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్ (యునిసెఫ్) వెల్లడించింది. ముఖ్యంగా బాలికలు తమ హక్కులను పొందలేకపోతున్నారని పేర్కొంది. పిల్లలపై జరుగుతున్న అకృత్యాల గురించి అందరూ అవగాహన కలిగి వాటిని ఎదుర్కొనే లాగా తయారవ్వాలని తెలియజేసింది.

మండల ఎంఈఓ మురళీధర్ మాట్లాడుతూ.. 1989 నవంబర్ 20వ తేదీన ఐక్యరాజ్యసమితిలో ప్రపంచ దేశాలు బాలల హక్కుల పైన సంతకం చేశారని.. అప్పటినుంచి ప్రభుత్వాలు బాలలకు విద్య కనీస వసతులు కల్పిస్తూ తల్లికి వందనం మధ్యాహ్న భోజన పథకాలు పథకాల ద్వారా పిల్లల హక్కుల్ని కాపాడడంలో కృషి చేస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డీడీ సోషల్ వెల్ఫేర్ శోభారాణి, బాలల సంక్షేమ సమితి చైర్పర్సన్ మాధవి, జిల్లా బాలల సంరక్షణ అధికారి సురేష్, లేబర్ డిపార్ట్మెంట్ నుంచి వెంకటేశ్వర్లు, ఏఎస్ ఐసతీష్ , డైరెక్టర్ శ్రీ ఐ. శ్రీనివాసరావు, పాఠశాల ఉపాధ్యాయులు శ్రీకృష్ణారెడ్డి, అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం సంబంధించి సందేశాన్ని ఇవ్వడం జరిగింది.

Leave a Reply