Bigg Boss9 | బిగ్ బాస్ శాడిజం… కరుణ చూపించిన ఇంటి సభ్యులు
- కుటంబ సభ్యులను కలిసిన సంజన!
Bigg Boss | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : సీజన్ 9 రణరంగం అంటూ ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లిన బిగ్‌బాస్(Bigg Boss) కొన్ని విషయాల్లో శాడిజం కూడా చూపిస్తున్నాడు. అయితే కొన్నిసార్లు బిగ్‌బాస్ శాడిజంను ఇంటి సభ్యులు ఎదుర్కొని తనలో ఉన్న మానవత్వం చాటుకుంటున్నారు. బిగ్‌బాస్ మాత్రం కొన్ని విషయాల్లో కరుణ చూపించడం లేదన్నది సుస్పష్టం.
బిగ్ బాస్ సీజన్ 9లో ఉన్న కంటెస్టెంట్స్ లో సంజనకు మంచి ఫ్యాన్ బేస్(fan base) ఉన్న సంగతి తెలిసిందే. ఫిజికల్ గా పెద్దగా ఆడకపోయినా ఇప్పటిదాకా హౌస్‌లో ఆమె కొనసాగడానికి అదే కారణం. తప్పుల మీద తప్పులు చేస్తూ దొంగగా పేరు తెచ్చుకున్న సంజన్‌ను బిగ్ బాస్ చేస్తున్న టార్చర్ మాములుగా లేదని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.
Bigg Boss9 | ఈ వారం ఫ్యామిలీ వీక్ కట్ .. అయినా!
లాస్ట్ వీకెండ్ హోస్ట్(Last Weekend Host) నాగార్జున ముంచేదెవరు తేల్చేది ఎవరు అంటూ కంటెస్టెంట్స్ కు టాస్క్ పెట్టిన సంగతి తెలిసిందే. ఆ టాస్క్‌లో ఎక్కువ మంది సంజన ముంచేస్తుందని చెప్పడంతో ఆమెపై బిగ్ బాంబ్(Big Bomb) వేశారు. సంజనకు ఫ్యామిలీ వీక్ కట్ అంటూ పనిష్మెంట్ ఇచ్చారు. దీంతో అక్కడే సంజన డీలా పడిపోయింది. ఫ్యామిలీ వీక్ లేకుండా ఉండలేను.. తాను ఇంటికి వెళ్ళిపోతా అని గుక్కపెట్టి ఏడ్చింది. దీంతో హౌస్ మేట్స్ ఆమెను ఓదార్చారు.
Bigg Boss9 | ఇంటి సభ్యుల కరుణతో భర్త, పిల్లలతో కలిసిన సంజన..

బిగ్ బాంబ్ వేసిన సంజనకు బిగ్ బాస్ మరో అవకాశం ఇచ్చారు. మిగిలిన కుటుంబ సభ్యులను ఒప్పించి ముగ్గురు నుంచి ముప్పయి నిమిషాలకు మించి లేకుండా ఇంటి సభ్యులను కలిసే సమయం పొందాలని బిగ్ బాస్ సూచించాడు. ఈ విషయాన్ని ఇంటి సభ్యులకు సంజన వివరించింది. ఇందుకు సంజనతో బాండింగ్ ఉన్న ఇమాన్యూల్(Emmanuel) పదిహేను నిమిషాలు ఇస్తానని చెప్పాడు.
కేవలం పదిహేను నిమిషాలు ఉన్న కళ్యాణ్ ఐదు నిమిషాలు త్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు. బిగ్ బాస్ అడిగినప్పుడు సంజన మాత్రం ఇమాన్యుల్ నుంచి పదిహేను నిమిషాలు, కళ్యాణ్ నుంచి ఒక నిమిషం తీసుకుని పదహారు నిమిషాలపాటు కుటుంబ సభ్యులను కలవడానికి అవకాశం పొందింది. ఆమె భర్త, ఇద్దరు పిల్లలతో పదహారు నిమిషాలు సమయం గడిపింది.
Bigg Boss9 | దట్ ఈజ్ సోల్జర్..
కళ్యాణ్ ఒక సోల్జర్.. ఒక సైనికుడికి ఎలాంటి త్యాగాలు ఉంటాయో నిరూపించడానికి ఒక మంచి వేదిక ఎంచుకున్నాడు. బిగ్‌బాస్‌పై ఎన్నో ఆరోపణలు ఉన్నా ఇలాంటి త్యాగాలు ఆవిష్కృతం కావడానికి ఒక వేదిక కావడం కూడా ప్రశంసించ వచ్చు. కళ్యాణ్ తన ఫ్యామిలీ గురించి చెప్పినప్పుడు ఇంటి సభ్యులే కాదు, ప్రేక్షకులు కూడా ఎమోషనల్(Emotional) అయ్యారు.
సుమన్ శెట్టికి త్యాగం చేయడం వల్ల కళ్యాణ్‌కు కేవలం పదిహేను నిమిషాలు మాత్రమే దక్కింది. అందులో కూడా సంజన కోసం త్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు. అయితే కళ్యాణ్ ఇచ్చిన ఐదు నిమిషాల్లో కేవలం ఒక నిమిషం మాత్రమే తీసుకుని తన మానవత్వాన్ని సంజన చాటుకుంది. ఎవరితోనూ ఎలాంటి బాండింగ్ లేని కళ్యాణ్ హౌస్‌లో ఎన్నో త్యాగాలు చేస్తున్నాడు. కళ్యాణ్.. దట్ ఈజ్ సోల్జర్!

