Soudi Bus Crash | అతడే బతికాడు

Soudi Bus Crash | అతడే బతికాడు

  • ఒక కుటుంబం గుర్తింపు..ఏడుగురు సజీవదహనం
  • మరో ఫ్యామిలీ జాడ లేడు
  • నలుగురు బస్సు ఎక్కలేదు
  • బస్సులో అందరూ హైదరాబాదీలే

Soudi Bus Crash

Soudi Bus Crash |  ( ఆంధ్రప్రభ, న్యూస్​ నెట్​ వర్క్​ ప్రతినిధి) సౌదీ అరేబియాలో సోమవారం తెల్లవారుజామున జరిగిన (Soudi Bus Crash)  రోడ్డు ప్రమాదంలో మరణించిన మృతుల్లో హైదరాబాదీలు ఎందరు? తెలంగాణ వాసులెందరో? తేలటం లేదు.  నవంబర్ 9న (Macca Travels)  ట్రావెల్స్ నుంచి 20 మంది, ఫ్లై జోన్ ట్రావెల్స్​ (Fly Zone Travels)  నుంచి మరో 24 మంది మక్కాకు బయలుదేరి వెళ్లారు. మక్కాలో దర్శనం తర్వాత మదీనాకు 40 మంది బయలుదేరారు.  నలుగురు (Four Members)  మాత్రం మక్కాలోనే ఉండిపోయారు. ఇక ఈ ప్రమాదంలో ఒకరు ప్రాణాలతో బయటపడగా మిగిలిన 39 మంది (At least 39 Hyserabadis Dead) చనిపోయినట్లుగా కుటుంబసభ్యులు భావిస్తున్నారు.

Soudi Bus Crash |  ప్చ్​ ​ .. రెండు కుటుంబాలు

 వారిలో రెండుకుటుంబాలకు ( 2 Family Members)  చెందిన 15 మంది ఉన్నారు. ఈరోజు తెల్లవారుజామున మక్కా(Macca bus fire) నుండి మదీనా(Madinah)కు ప్రార్ధనల కోసం వెళుతున్న ట్రావెల్స్ బస్సు ఎదురుగా వస్తున్న డీజల్ ట్యాంకర్ ను (Oil Tanker)  ఢీకొన్నపుడు (collision)  ఈ ప్రమాదం జరిగింది. రెండు వాహనాలు బాగా వేగంతో ప్రయాణిస్తున్నపుడు ఢీకొన్నపు ప్రమాదంజరగటంతో ట్యాంకర్​ లోని డీజల్ (desel)  కారణంగా మంటలు మొదలయ్యాయి.

Soudi Bus Crash |  ట్యాంకర్​ ఆయిల్​ మంటే..

 ట్యాంకర్​ లోని డీజల్ బస్సుమీద కూడా పడటంతో బస్సుకు కూడా మంటలు అంటుకున్నాయి.   ప్రమాద తీవ్రత కారణంగా బస్సు ట్యాంకర్​ లోని ఆయిల్ కూడా బయటకు రావటంతో ఒక్కసారిగా మంటలు లేచి బస్సును చుట్టుముట్టేశాయి. ప్రమాదం జరిగినపుడు ప్రయాణీకులు 44 మంది (44 passengers)  మంచి నిద్రలో (deep sleep)  ఉండటంతో ఏమి జరిగిందో తెలుసుకునేలోపే సజీవదహనమయ్యారు.

Soudi Bus Crash |  అందరూ హైదరాబాదీలే..

  ఈ ప్రమాదం నుండి  మహ్మమద్ అబ్దుల్ షోయబ్ (Mahamud Abdul Soyab)  అనే హైదరాబాదీ  యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. చనిపోయిన వారిలో 20 మంది మహిళలు, 11 మంది చిన్నపిల్లలుండగా మిగిలిన 11 మంది మగవాళ్ళు. హైదరాబాద్ నుండి ఈనెల 9వ తేదీన 44 మంది మక్కా ట్రావెల్స్ (Macca Travel) ,  ఫ్లైజోన్ ట్రావెల్స్ (Fly Jone)  ద్వారా సౌదీ అరేబియా చేరుకున్నారు. మృతులు అత్యధికులు హైదరాబాదీలే.   రెండు కుటుంబాలకు చెందిన 15 మంది హైదరాబాదీలు మృతి  చెందినట్టు  పోలీసులు గుర్తించారు. చనిపోయిన వారిలో రెండు కుటుంబాలకు చెందిన 15 మంది ఉన్నట్లు సమాచారం.  ఎనిమిదిమంది ఒక కుటుంబం,   ఏడుగురు మరో కుటుంబీకులు. ఎనిమిదిమంది ఫ్యామిలీ సభ్యుల్లో  మహమ్మద్ అబ్దుల్ షోయబ్ గాయాలతో బస్సులో నుండి బయటపడగా మిగిలిన ఏడుగురు మరణించారు.  

Soudi Bus Crash |  ఓ కుటుంబం మటాష్​

షోయబ్ తండ్రి (Soyab father)  మహమ్మద్ అబ్దుల్ కదీర్ (Md.A.Kdir) , షోయబ్ తల్లి గౌసియాబేగం (Gousia begum), గౌసియా బేగం తండ్రి మహమ్మద్ మౌలానా (Md.Moulana_, రహీమ్ ఉన్నీసా (Rhimunnisa), రెహమత్ బీ (rahamat bi), మహమ్మద్ మన్సూర్  (Md Mansoor) తో పాటు మరో బంధువు ఉన్నాడు.  రెండో కుటుంబానికి చెందిన ఏడుగురూ సజీవదహనమైపోయారు. ఈ విషయాన్ని హైదరాబాద్ పోలీసు కమీషనర్ వీసీ సజ్జనార్ ( VC Sajjanar)  నిర్ధారించారు. రెండో కుటుంబానికి చెందిన ఏడుగురి వివరాలను సేకరించే ప్రయత్నంచేస్తున్నట్లు సజ్జనార్ తెలిపారు. హైదరాబాద్ నుండి వెళ్ళిన 44 మందిలో మక్కా దర్శనం తర్వాత నలుగురు మక్కాలోనే ఆగిపోగా మిగిలిన 40 మంది మదీనాకు ప్రయాణమైనట్లు సజ్జనార్ తెలిపారు.

Soudi Bus Crash | ఆ ఫ్యామిలీ జాడ లేదు  

 మరో కుటుంబానికి చెందిన ఏడుగురు కూడా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. వారికి సంబంధించి ఎలాంటి సమాచారం అందకపోవడంతో చనిపోయినట్టుగా కుటుంబసభ్యులు భావిస్తున్నారు. ఘటన జరిగిన దగ్గర నుంచి ఆ ఏడుగురు అందుబాటులో లేకుండా పోయారు. నవంబర్ 9న ట్రావెల్స్ నుంచి 20 మంది, ఫ్లై జోన్ నుంచి మరో 24 మంది మక్కాకు బయలుదేరి వెళ్లారు. మక్కాలో దర్శనం తర్వాత మదీనాకు 40 మంది బయలుదేరగా.. నలుగురు మాత్రం మక్కాలోనే ఉండిపోయారు. ఇక ఈ ప్రమాదంలో ఒకరు ప్రాణాలతో బయటపడగా మిగిలిన 39 మంది చనిపోయినట్లుగా కుటుంబసభ్యులు భావిస్తున్నారు.

ఇదీ చదవండి అమెరికాలో కుప్పకూలిన విమానం..

https://www.google.com/search?sca_esv=2befaf33c0068c33&rlz=1C1OKWM_enIN1097IN1099&sxsrf=AE3TifO8YQNLPlPSP1lSJk4vcL9mN1nDQw:1763381396197&q=saudi+bus+crash&tbm=nws&source=lnms&fbs=AIIjpHxU7SXXniUZfeShr2fp4giZ1Y6MJ25_tmWITc7uy4KIeqDdErwP5rACeJAty2zADJgYJpo1blvMpITBRgbnARM6y8KwxzRsF24u6g33NutBQiYU4YYg2NVY9oewD6JMcYBKargMsgCi4cL08u6SynE_cy-05ouuwN6iQirrv5M9n70PIysVTl7Iu_TGD_Sddr0p2qNgSo3BfXOJ_vI1AD3GRn5E_w&sa=X&ved=2ahUKEwivgeXNk_mQAxVOUGcHHZOjL2QQ0pQJegQIFRAB&biw=1366&bih=625&dpr=1https://www.google.com/search?sca_esv=2befaf33c0068c33&rlz=1C1OKWM_enIN1097IN1099&sxsrf=AE3TifO8YQNLPlPSP1lSJk4vcL9mN1nDQw:1763381396197&q=saudi+bus+crash&tbm=nws&source=lnms&fbs=AIIjpHxU7SXXniUZfeShr2fp4giZ1Y6MJ25_tmWITc7uy4KIeqDdErwP5rACeJAty2zADJgYJpo1blvMpITBRgbnARM6y8KwxzRsF24u6g33NutBQiYU4YYg2NVY9oewD6JMcYBKargMsgCi4cL08u6SynE_cy-05ouuwN6iQirrv5M9n70PIysVTl7Iu_TGD_Sddr0p2qNgSo3BfXOJ_vI1AD3GRn5E_w&sa=X&ved=2ahUKEwivgeXNk_mQAxVOUGcHHZOjL2QQ0pQJegQIFRAB&biw=1366&bih=625&dpr=1

Leave a Reply