Anganwadi | ఆరోగ్యంతో ఆటలా..?

Anganwadi | ఆరోగ్యంతో ఆటలా..?

Anganwadi | నడికూడ, ఆంధ్రప్రభ – పిల్లలకు పౌష్టికాహారం అందించాల్సిన అంగన్వాడీ (Anganwadi) సెంటర్లు నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదు. గురువారం నడికూడ మండలంలోని వెంకటేశ్వరపల్లి గ్రామంలో 2 అంగన్వాడీ సెంటర్లకు అక్షయపాత్ర ఫౌండేషన్ ద్వారా భోజనం పెడుతున్నారు. చిన్నారులకు అందిస్తున్నభోజనం నాణ్యత లేకుండా పెడుతున్నట్లు ఆరోపణలు చోటు చేసుకున్నాయి. స్థానికుల సమాచారం ప్రకారం… ముక్కుపచ్చలారని పసిపిల్లలకు నాణ్యమైన భోజనం పేరుతో చింతపండు పులుసు, శుభ్రత లేని ఆహారం అందిస్తున్నారని ఆరోపిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆవేదనకు గురవుతున్నారు.

నాణ్యత లేని భోజనం పెట్టి తమ పిల్లల ఆరోగ్యంతో ఆటలాడుతారా అంటూ నిర్వాహకులను నిలదీస్తున్నారు. ఈ కారణం చేత చిన్నారుల తల్లిదండ్రులు తమ పిల్లలను అంగన్వాడీకి పంపించడానికి నిరాకరిస్తున్నారు. ఇలాంటి నిర్లక్ష్యపు నిర్వాహకుల కారణంగా ప్రభుత్వం (Govt) పై విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి వారిని గుర్తించి సంబంధిత అధికారులు చర్యలు చేపట్టకపోతే తీవ్ర పరిణామాలు చోటుచేసుకునే ప్రమాదం కనిపిస్తుంది. భీమదేవరపల్లి ప్రాజెక్టు అంబాల సెక్టర్ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల పై జిల్లా కలెక్టర్ దృష్టి సారించి, సమగ్ర విచారణ జరిపించాలని స్థానికులు కోరుతున్నారు.

Leave a Reply