పార్వతిపురం ఏఎస్పీగా నంద్యాల జిల్లా యువతి

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లాలోని మహానంది మండలానికి చెందిన ఓ యువతి గత ఏడాది ఐపీఎస్‌గా ఎంపికయ్యారు. నంద్యాల జిల్లా మహానంది మండలం నంది పల్లెకు చెందిన వంగల మనిషా రెడ్డి మన్యం జిల్లా పార్వతీపురం ఎస్పీగా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ గతంలో ఐపీఎస్‌గా సెలక్షన్ అయినా మనీషా రెడ్డి గ్రేహౌండ్స్ దళంలో అసాల్డ్ కమాండర్‌గా ఉన్నారు. ఈమెను ఇటీవల ఉన్నతాధికారులు పార్వతీపురం ఏఎస్పీగా నియమించారు. ఈ మేరకు తల్లిదండ్రులు పార్వతీపురం చేరుకొని ఆమెను విధుల్లో చేర్పించారు. ఆమెను అభినందించారు. చిన్నప్పటి నుంచి కష్టపడే మనస్తత్వం ఉన్న ఈ అమ్మాయి ఐసీఎస్ సెలెక్ట్ కావటం గర్వకారణం అన్నారు. తమ గ్రామానికి చెందిన వంగల మనీషారెడ్డి రాష్ట్రస్థాయిలోని మన్యం జిల్లా పార్వతీపురం ఏఎస్పీగా నియమించడంతో గ్రామ ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply