సీమ ప్ర‌జ‌ల ఆగ్ర‌హం చూస్తారు!

సీమ ప్ర‌జ‌ల ఆగ్ర‌హం చూస్తారు!

రాయలసీమ ప్రాణాధారం శ్రీశైలం
సాగునీటి సమితి రాష్ట్ర అధ్యక్షుడు బొజ్జా దశరథ రామిరెడ్డి

నంద్యాల బ్యూరో అక్టోబర్ 26 ఆంధ్రప్రభ : శ్రీశైలం క్షేత్రాన్ని కొత్తగా ఏర్పాటుచేస్తున్న మార్కాపూర్ జిల్లాలో కలుపుతారన్న వదంతులు రాయలసీమ ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని సాగునీటి సమితి రాష్ట్ర అధ్యక్షుడు బొజ్జా దశరథ రామిరెడ్డి అన్నారు. ఆదివారం త‌న కార్యాలయంలో విలేక‌రుల‌తో మాట్లాడారు. . ఇది రాయలసీమ గౌరవానికి, అభివృద్ధి అవకాశాలకు పెద్ద దెబ్బ అవుతుందని ఆందోళన వ్యక్తపరిచారు. రాయలసీమకు గర్వకారణమైన శ్రీశైలం ప్రాంతాన్ని రాయలసీమకు దూరం చేసే ఏ ప్రయత్నాన్నైనా స‌హించ‌ర‌ని, సీమ ప్ర‌జ‌ల ఆగ్ర‌హాన్ని చూస్తార‌ని హెచ్చ‌రించారు.

రాయలసీమ ప్రాణాధారం శ్రీశైలం అని పేర్కొన్నారు. గతంలో నంద్యాల పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి రాయలసీమతో సహజ సంబంధాలు ఉన్నాయి. అనేక మంది గిద్దలూరు ప్రాంత వాసులు నంద్యాలలో ఉపాధ్యాయులుగా, ప్రభుత్వ ఉద్యోగులుగా స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. వారందరినీ మేము అన్నదమ్ములుగా భావించి ఆదరిస్తున్నాం.‌ ఈ సంబంధాన్ని మరింత బలంగా కొనసాగించడానికి గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గాన్ని నంద్యాల జిల్లాలో కలపాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నరు. ప్రజా ప్రతినిధులారా శ్రీశైలం రాయలసీమ ప్రాంతంలోనే ఉండేటట్టు కృషి చేయండ‌ని కోరారు..
స‌మావేశంలో సమితి ఉపాధ్యక్షులు వై.యన్.రెడ్డి, నిట్టూరు సుధాకర్ రావు పాల్గొన్నారు.

Leave a Reply