సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తే చ‌ర్య‌లు

సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తే చ‌ర్య‌లు

చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి
రెండు వ‌ర్గాల మ‌ధ్య ఉద్రిక్త‌త‌.. ఐదుగురిపై కేసు

చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో: సోషల్ మీడియా వేదికలను దుర్వినియోగం చేస్తూ ఇతరులను రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తే, చట్టపరమైన చర్యలు తప్పవని చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి హెచ్చరించారు. సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపుల్లో పరస్పరం అసభ్యకర వ్యాఖ్యలు, రెచ్చగొట్టే పోస్టులు పెట్టుకోవడంతో రెండు వర్గాల మధ్య ఉద్రిక్తత ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈ నెల 19 రాత్రి సుమారు 9.00 గంటల సమయంలో ఎస్.ఆర్.పురం మండలం, పోధలపల్లి హరిజనవాడలో అదే గ్రామానికి చెందిన ఆర్‌.ఏకాంబరం, ఆర్‌.భరత్‌, ఆర్‌.లోకేష్‌, యం‌.రాజేష్‌, ఆర్‌.చరణ్‌ లు మారణాయుధాలతో ఆనందరావు ఇంటిపై దాడి చేసి, ఆయనతో పాటు కుటుంబ సభ్యులు మార్కొండయ్య, భారతి, జానీల‌పై దాడి చేయ‌డంతో తీవ్ర గాయాల‌య్యారు. అంతేకాక ఇంటి తలుపులు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై జిల్లా జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు, నగరి సబ్ – డివిజన్ డి.ఎస్పీ సయ్యద్ మొహమ్మద్ అజీజ్ పర్యవేక్షణలో ఎస్.ఆర్.పురం పోలీస్‌స్టేషన్‌లో ఎస్. ఐ సుమన్ కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపారు. బాధితుల ఫిర్యాదు మేర‌కు పోలీసులు నిందితుల‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Leave a Reply