అమ‌రుడైన బీఎస్ఎఫ్ జ‌వాన్‌

అమ‌రుడైన బీఎస్ఎఫ్ జ‌వాన్‌

  • చింతూరు మండ‌లంలో క‌ల్వ‌ర్టును ఢీకొట్ట‌డంతో ప్ర‌మాదం
  • హెచ్చ‌రిక బోర్డు లేక‌పోవ‌డ‌మే కార‌ణం
  • మ‌రో ఐదుగురు జ‌వాన్ల‌కు గాయాలు

చింతూరు, (ఏయస్ఆర్ జిల్లా), (ఆంధ్రప్రభ): రోడ్డు ప్రమాదంలో బీఎస్ఎఫ్ జవాన్ మృతి చెందిన ఘటన తెల్లవారుజామున జరిగింది. ఈ ఘటనకు సంబంధించి చింతూరు ఎస్సై పేరూరి రమేష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బోర్డర్ ఆఫ్ సెక్యూరిటీ ఫోర్స్కు సంబంధించిన ఏడుగురు బీఎస్ఎఫ్ జవాన్లు ఖమ్మం నుంచి ఒడిశా రాష్ట్రం బలిమేలకు ఇన్నోవా కారులో వడ్తుండుగా మార్గం మధ్యలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం తెల్లవారుజామున విజయవాడ- జగదల్పూర్ జాతీయ రహదారిలో చింతూరు మండలం చట్టి జంక్షన్ కి దగ్గరలో గల కలవర్టును ప్రమాదవశాత్తు కారు ఢీకొంది..

ఈ ప్రమాదంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నో జిల్లా గొంటినగర్ కి చెందిన గౌరవ్ కుమార్ పాండే అనే బీఎస్ఎఫ్ జవాన్ మృతిచెందాడు. ఈ ప్రమాదంలో మరో ఐదుగురు జవాన్లు గాయలపాలయ్యారు. విష‌యం తెలుసుకున్న చింతూరు ఎస్సై హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని క్ష‌త‌గాత్రుల‌ను చింతూరు గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించి ప్రధమ చికిత్సలు అనంతరం భద్రాచలం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఈ సంఘటనపై చింతూరు పోలీసు వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయుచున్నారు. ఒక పక్క నేడు పోలీస్ అమరవీరుల దినోత్సవం ఉండగా అదే రోజు జవాన్ మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది.

Leave a Reply