ట‌పాసుల విక్ర‌య‌దారుల‌కు ఏఎస్పీ సూచ‌న‌

ట‌పాసుల విక్ర‌య‌దారుల‌కు ఏఎస్పీ సూచ‌న‌

అక్రమంగా టపాసులు విక్రయిస్తే 112, లేదా 100కు కాల్ చేయండి

నంద్యాల బ్యూరో అక్టోబర్ 18 ఆంధ్రప్రభ : జిల్లాలో దీపావళి పర్వదిన సందర్భంగా టపాసుల నిల్వ, విక్రయాల్లో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని నంద్యాల ఏఎస్పీ ఎం. జావళి పేర్కొన్నారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ పోలీసు నియమ నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా ప్రవర్తిస్తే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా అక్రమంగా టపాసులు విక్రయిస్తున్నా వెంటనే డయల్ నెంబర్ 112 లేదా 100 కు లేదా సంబంధిత పోలీసు స్టేషన్ కు సమాచారం చేరవేయాల‌ని సూచించారు. వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు.

టపాసులు విక్రయించే ప్రాంతాల్లో తీసుకోవలసిన జాగ్రత్తలకు పై నియ నిబంధనలను తెలియజేశారు.ప్రమాదాలకు తావులేకుండా, సరైన భద్రతా ప్రమాణాలు, సూచనలు పాటిస్తూ షాప్ లు ఏర్పాటు చేసుకొని టపాసులను విక్రయించాలని సూచించారు. బాణసంచా విక్రయదారులు చట్టం సూచించిన నిబంధనలు, జాగ్రత్తలు పాటించాల‌న్నారు. .నీరు, ఇసుక, తదితర అగ్నిమాపక సామ‌గ్రిని తప్పనిసరిగా టపాసుల విక్రయ దుకాణాల్లో సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. చిన్న పిల్లలను ట‌పాకాయ‌ల విక్రయాల పనుల్లో ఉంచుకోరాదన్నారు. ఏదైనా అగ్ని ప్రమాదం సంభవిస్తే తీసుకోవలసిన చర్యలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply