అర్జున్ కుటుంబానికి ఎంపీ భ‌రోసా

మృతుడి కుటుంబానికి, గాయ‌ప‌డిన వారికి కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు ప‌రామ‌ర్శ‌
అర్జున్ కుటుంబంలో ఒక‌రికి ఉద్యోగం క‌ల్పిస్తామ‌ని హామీ

కర్నూలు బ్యూరో, అక్టోబర్ 17 (ఆంధ్రప్రభ): కర్నూలులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ బహిరంగ సభకు వెళ్తూ జరిగిన విషాద ఘటనలో మృతిచెందిన అరు్జ‌న్ కుటుంబాన్ని ఆదుకుంటామ‌ని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు (MP Basti Patti Nagaraju) భ‌రోసా ఇచ్చారు.

ఈ మేర‌కు శుక్ర‌వారం మునగాలపాడు (munagalapadu) గ్రామానికి చెందిన అర్జున్ మృతదేహాన్ని శనివారం ఎంపీ నాగరాజు స్వయంగా సందర్శించి, పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి బాధను పంచుకున్నారు.

ఈ సందర్భంగా ఎంపీ నాగరాజు మాట్లాడుతూ.. సూపర్ సక్సెస్ (Super success) అయిన మోదీ బహిరంగ సభలో ఈ రకమైన ప్రమాదం జరగడం తీవ్ర విచార‌క‌ర‌మ‌న్నారు. అర్జున్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందిస్తాం. అలాగే కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అదేవిధంగా, ఈ ఘటనలో గాయపడిన ఇదే గ్రామానికి చెందిన మరో ఇద్దరిని కూడా ఎంపీ పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులతో విచారించి, మెరుగైన చికిత్స అందించాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు.

Leave a Reply