ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి..
మెదక్, ఆంధ్రప్రభ : మఎదక్ జిల్లా నార్సింగి మండల పరిధిలో ఉన్నకాశ్యతాండలో బీఆర్ఎస్ పార్టీ మాజీ జెడ్పీటీసీ బానపురం కృష్ణారెడ్డి(Banapuram Krishna Reddy) ఆధ్వర్యంలో బాకీ కార్డు(outstanding card)లను పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్(demand) చేశారు.
మోసపూరితమైన వాగ్దానాలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మైలారం బాబు, శంకరంపెట్ రాజు, మాజీ వైస్ ఎంపీపీ సుజాత, గోoడ స్వామి, అజయ్ గౌడ్(Ajay Goud), యాదగిరి, నాయకులు తదితరులు పాల్గొన్నారు

