ఛత్తీస్ గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో ఘటన..

చింతూరు (ఏఎస్ఆర్ జిల్లా), ఆంధ్రప్రభ : మావోయిస్టులు అమర్చిన ఐఈడీ పేలి బాలుడికి గాయాలైన సంఘటన ఛత్తీస్ గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో శుక్రవారం చోటు చేసుకుంది.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఛత్తీస్ గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పిడియాలో ఒక బాలుడు రోడ్డుపై ఆడుకుంటుండుగా మావోయిస్టులు అమర్చిన ఐఈడీపై ప్రమాదవశాత్తు కాలు పెట్టడంతో ఒక్కసారిగా పేలింది.
ఈ ప్రమాదంలో బాలుడికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన బాలుడు ను సీఆర్‌పీఎఫ్ పోలీసులు చూసి తమ వాహనంలో ఆస్పత్రికి తరలించారు. గాయపడిన బాలుడు బీజాపూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
