వాల్మీకి అడుగుజాడల్లో నడవాలి

జిల్లా కలెక్టర్ ఏ.శ్యాం ప్రసాద్

శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : రామాయణాన్ని లోకానికి పరిచయం చేసిన ఆదికవి వాల్మీకి మహర్షి జీవితం ఆదర్శనీయమని, వారి అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని జిల్లా కలెక్టర్ ఏ. శ్యాం ప్రసాద్ పేర్కొన్నారు. మంగళవారం డా. ఏ.పి.జె. అబ్దుల్ కలాం షాది మహల్ ఫంక్షన్ హాల్లో జిల్లా వెనుక బడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహర్షి వాల్మీకి జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఏ. శ్యాం ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రామాయణ మహాకావ్యాన్ని రచించడం ద్వారా సీతా రాముల సద్గుణాలును, గొప్పదనాన్ని చెప్పడంతో పాటు ఆదర్శవంతమైన జీవితం, కుటుంబ విలువల నుంచి పాలనా సూత్రాల వరకు , సమాజ శ్రేయస్సుకు అవసరమైన ఎన్నో జీవన సూత్రాలను తెలియచేసిన వాల్మీకి మహర్షికి మనమందరం రుణపడి ఉన్నామన్నారు. రామాయణం సామాజిక నీతిని బోధిస్తుందన్నారు. అందరూ ఆయ‌న జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని దైనందిన జీవితంలో స్పూర్తితో జీవించాలన్నారు. అనంతరం వాల్మీకి కుల సంఘాల నాయకులు తెలిపిన సమస్యలను పరిశీలించి పరిష్కార చర్యలు తీసుకుంటామని అన్నారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. కార్యక్రమంలో చిన్నారులు చేసిన నృత్యాలు, నాటక ప్రదర్శన లు అందరిని అలరించాయి.
కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఓబులపతి, వాల్మీకి సంఘ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మి నారాయణ, వాల్మీకి సంఘ జిల్లా అధ్యక్షులు సి. గంగన్న,టీడీపీ సాధికారత సంఘ అధ్యక్షులు రామాంజనేయులు, టీడీపీ నాయకులు సాకే ఆదినారాయణ, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ అధికారి జి. రాజేంద్ర కుమార్ రెడ్డి, సాంఘీక సంక్షేమ శాఖ డిడి, సంబధిత నాయకులు, కుల సంఘాలు తదితరులు పాల్గొన్నారు.

కలెక్టరేట్‌లో..
స్థానిక కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ వారు మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా ఆయ‌న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో వెంకట నారాయణ, కలెక్టరేట్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply