13 మందికి గాయాలు..

భూపాలపల్లి, ఆంధ్రప్రభ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రం శివారు బాంబుల గడ్డ సమీపంలో జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు, కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. భూపాలపల్లి డిపోకు చెందిన పల్లె వెలుగు బస్సు భూపాలపల్లి నుంచి మంచిర్యాల వైపు వెళుతున్నక్రమంలో కాళేశ్వరం నుంచి భూపాలపల్లి వస్తున్న కారు ఢీకొన్నాయి.
ఈ ప్రమాదం లో ఆర్టీసీ బస్సు, కారు నుజ్జునుజ్జు అయ్యాయి. కారులో ఈ ప్రమాదంలో 13 మందికి గాయాలయ్యాయి. ఇందులో ముగ్గురికి తీవ్ర గాయాలవ్వడంతో ఆస్పత్రిలో చేరారు. మరో పది మంది స్వల్ప గాయాలు కావడంతో వారికి నచ్చిన ఆస్పత్రలకు వెళ్లిపోయారు. సమాచారం తెలిసిన వెంటనే ఆర్టీసీ డీఎం ఇందు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
