ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఫీజు రీయింబర్స్‌మెంట్ (Fee reimbursement) బకాయిలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ప్రైవేట్ విద్యాసంస్థలు కాలేజీల (colleges) బంద్ పాటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిరసనగా సోమవారం కళాశాలలను మూసివేశారు. అయితే ఈ విషయంలో ఆదివారం కాలేజీల యాజమాన్యాలతో చర్చలు జరిపిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka), మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) చర్చలు జరిపారు. కానీ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల చెల్లింపుల విషయం కొలిక్కి రాలేదు. దీంతో సోమవారం భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబులు ఇద్దరూ సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy)తో సమావేశమయ్యారు. బకాయిల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందని విధ్యార్థుల భవిష్యత్ దృష్ట్యా కాలేజీలు సమ్మె విరమించి యధావిధిగా తరగతులు నిర్వహించాలని సీఎం తెలిపినట్లు సమాచారం.
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించేందుకు సీఎం రేవంత్ ఓకే చెబుతున్నా… కాలేజీల విద్యావ్యవస్థ, నాణ్యత ప్రమాణాలపై సీరియస్‌గా ఉన్నారు. ఈ విషయంలో గత ప్రభుత్వంలో కేసీఆర్ వేసిన విజినెల్స్ కమిషన్ రిపోర్టు(Viginels Commission report submitted by KCR) ను పరిశీలించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. నాణ్యత ప్రమాణాలు పాటించకుండా ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని కాలేజీలు వినియోగించుకుంటున్నాయని, ప్రతి ఏటా ఫ్యాక్ట్ పైండింగ్ కమిటీల తనిఖీలు తూతూమంత్రంగానే జరుగుతున్నాయని విద్యార్థి సంంఘాలు (student associations) ఆరోపిస్తున్నాయి. ఇక ఇటీవల ఇంజినీరింగ్ (engineering), వృత్తి విద్య కోర్సుల ఫీజుల విషయంలోనూ కాలేజీల యాజమాన్యాలు తప్పుడు నివేదికలు ఇచ్చినట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో విజిలెన్స్ కమిషన్ రిపోర్టుపై తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఆరా తీస్తున్నట్లు సమాచారం.

