Tirumala Darshanam | శ్రీ వారి దర్శనానికి 24 గంటలు సమయం

తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకీ పెరుగుతోంది. శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనానికి దేశం నలుమూలల నుండి వచ్చిన భక్తులతో తిరుమల మళ్లీ కిక్కిరిసి పోతోంది.

ప్రస్తుతం సర్వదర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయాయి. వీటి వెలుపల కూడా వేలాది మంది భక్తులు క్యూలైనులో వేచి ఉన్నారు. సర్వదర్శనం పొందేందుకు భక్తులకు సుమారు 24 గంటల సమయం పడుతోంది.

నిన్న ఒక్కరోజే 90,211 మంది భక్తులు శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అలాగే 43,346 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. భక్తులు హుండీలో రూ. 3.11 కోట్ల కానుకలు సమర్పించుకున్నారు. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా క్యూలైన్లను సక్రమంగా నిర్వహిస్తున్నారు. తిరుమలలో వేసవి సెలవుల దృష్ట్యా భక్తుల ప్రవాహం మరికొన్ని రోజులు కొనసాగనుంది..

Leave a Reply