హైదరాబాద్: గ్రూప్-2 అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీఎస్పీఎస్సీ) కీలక ప్రకటనను జారీ చేసింది. అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేస్తూ.. ఈ నెల 27 – జూన్ 7 వరకు ధృవీకరణ ప్రక్రియ చేపడుతున్నట్టు తెలిపింది.
ఈ ప్రక్రియకు సంబంధించిన సమాచారం… అర్హులైన అభ్యర్థులకు ఇప్పటికే పంపినట్లు పేర్కొంది. మరిన్ని వివరాలకు టీఎస్‌పీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ https://www.tspsc.gov.in ను సందర్శించాలని సూచించింది.
అభ్యర్థులకు సూచనలు:
సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు హాజరయ్యే అభ్యర్థులు తమ అన్ని ఒరిజినల్ ధృవీకరణ పత్రాలతో పాటు, ఒక సెట్ సంతకం చేసిన ఫోటోకాపీలను తప్పనిసరిగా తీసుకురావాల్సి ఉంటుంది. ఏదైనా కారణంతో వెరిఫికేషన్‌కు హాజరుకాకపోతే, లేదా వెబ్ ఆప్షన్స్ సరిగా నమోదు చేయకపోతే, అటువంటి అభ్యర్థులను అనర్హులుగా ప్రకటిస్తామని కమిషన్ స్పష్టం చేసింది.
ఇలాంటి ఖాళీల కోసం మరింతమంది అభ్యర్థులను అదనంగా పిలవనున్నట్టు వెల్లడించింది. కావున ఎంపికైన అభ్యర్థులు ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు సమయానికి హాజరై, అవసరమైన పత్రాలు సమర్పించాల్సిన అవసరం ఉందని టీజీఎస్పీఎస్సీ పేర్కొంది.
ఇతర అవసరమైన వివరాల కోసం టీఎస్‌పీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ (https://www.tspsc.gov.in) ను సందర్శించాలని కమిషన్ కోరింది.