చత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాలో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో 31 మంది మావోలు హతమయ్యారు. ఇందులో మావోయిస్టు అగ్ర నేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్ అలియాస్ గగన్నా కూడా ఉన్నారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు పై అలిపిరి లో బాంబ్ బ్లాస్ట్, బలిమెలలో భద్రత బలగాలపై దాడిలో నంబాల కీలక సూత్రధారి. భారతదేశ మావోయిస్టు ఉద్యమంలో ప్రముఖ నాయకుడు. ప్రస్తుతం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్టు) ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. 2018 లో ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి నుంచి ఆయన ఈ బాధ్యతలు స్వీకరించారు…
వ్యక్తిగత నేపథ్యం..
పుట్టిన సంవత్సరం: 1955
జన్మస్థలం: జియన్నపేట గ్రామం, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్
విద్యా ప్రస్థానం: వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (మునుపటి రీజినల్ ఇంజినీరింగ్ కాలేజ్) నుంచి బీటెక్ పూర్తి చేశాడు.
ఉద్యమంలో పాత్ర
నంబాల కేశవరావు 1970ల నుంచి నక్సలైట్ ఉద్యమంలో చురుకుగా పాల్గొంటున్నారు. 1980లో ఆంధ్రప్రదేశ్‌లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్) పీపుల్స్ వార్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. 2004లో పీపుల్స్ వార్ మరియు మావోయిస్టు కమ్యూనిస్ట్ సెంటర్ ఆఫ్ ఇండియా విలీనంతో ఏర్పడిన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్టు)లో కేంద్ర సైనిక కమిషన్ నాయకత్వ బాధ్యతలు చేపట్టారు.
సైనిక నైపుణ్యం
గెరిల్లా యుద్ధ నైపుణ్యాలు, పేలుడు పదార్థాల వినియోగం, ముఖ్యంగా ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లోసివ్ డివైసెస్ వినియోగంలో నిపుణుడు. 1987లో బస్తర్ అడవుల్లో లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలాం మాజీ యోధుల దగ్గర శిక్షణ పొందారు.
ప్రముఖ దుర్ఘటనలు..
నంబాల కేశవరావు అనేక ప్రధాన మావోయిస్టు దాడుల వెనుక ఉన్నారని అనుమానిస్తున్నారు. 2010లో దంతేవాడలో 76 సీఆర్‌పీఎప్ జవాన్లు హతమైన దాడి, 2013లో జీరాం ఘాటిలో 27 మంది, అందులో మాజీ మంత్రి మహేంద్ర కర్మ, కాంగ్రెస్ నాయకుడు నంద కుమార్ పటేల్ హత్యలు ఆయన ప్రణాళికలో భాగంగానే జరిగాయని భావిస్తున్నారు. అలాగే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తిరుపతిలో జరిగిన బాంబు దాడి , ఆంధ్రప్రదేశ్‌లోని అరకులో తెలుగుదేశం పార్టీ నాయకుడు కిడారి శరవేశ్వర్ రావు హత్య, బలిమెలలో దాడిలో కూడా కేశవరావు హస్తం ఉందని అధికార వర్గాలు అంటున్నాయి.
ప్రస్తుత స్థితి
ప్రస్తుతం భారత జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ హిట్ లిస్టులో నంబాల కేశవరావు ఉన్నారు. ప్రస్తుతం పరారీ జాబితాలో ఉన్నాడు. ఇతడి సమాచారం కోసం రూ.1.5 కోట్ల బహుమతి ప్రకటించబడింది. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మహారాష్ట్ర అడవుల్లో మావోయిస్టు కార్యకలాపాలను నడిపిస్తున్నారని సమాచారం.