అనంతపురం బ్యూరో, మే 16 (ఆంధ్రప్రభ) – తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ అనంతపురం జిల్లా పర్యటన అర్ధాంతరంగా ముగిసింది. ప్రధానమంత్రి తో అపాయింట్మెంట్ లభించడంతో ఆయన తన పర్యటన కుదించుకొని తిరుగు ప్రయాణం అయ్యారు. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు కుమార్తె వివాహ వేడుకల్లో పాల్గొన్న లోకేష్ మధ్యాహ్నం తన పర్యటనను ముగించుకున్నారు. ఈనెల 17వ తేదీన అనంతపురం జేఎన్టీయూ కాన్వకేషన్ లో గవర్నర్ తో కలిసి పాల్గొనాలి. కాగా, ఢిల్లీలో ప్రధాని మోడీలో అపాయింట్మెంట్ ఖరారు అయినట్లు సమాచారం రావడంతో ఆయన అన్ని కార్యక్రమాలు రద్దు అయ్యాయి. జిల్లా పార్టీ నాయకులతో జరగాల్సిన సమావేశం తిరంగా ర్యాలీ సైతం రద్దయిపోయింది. విజయవాడకు చేరుకున్న అనంతరం నారా లో కేష్ అక్కడ నుంచి ఢిల్లీ వెళ్లే అవకాశాలున్నాయి.
AP | మంత్రి నారా లోకేష్ కు ప్రధాని అపాయింట్మెంట్ … అర్ధంతరంగా ముగిసిన అనంత పర్యటన

