కాంగ్రెస్ కుంభకోణాలతో సింగరేణి సర్వనాశనం!

కాంగ్రెస్ కుంభకోణాలతో సింగరేణి సర్వనాశనం!

  • కాంగ్రెస్ హటావో… సింగరేణికి బచావో!
  • బొగ్గు పరిశ్రమలు కాపాడుకుందాం
  • సింగరేణి పరిరక్షణ సదస్సులో హరీష్ రావు స్పష్ఠికరణ

గోదావరిఖని, ఆంధ్రప్రభ:

137 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన సింగరేణి బొగ్గు పరిశ్రమ ప్రస్తుతం నష్టాల్లో కొట్టుమిట్టాడుతోందని…. కాంగ్రెస్ ప్రభుత్వ కుంభకోణాల పరంపరాల మధ్య సింగరేణి పరిశ్రమ సర్వనాశనం కాబోతుందని భారత రాష్ట్ర సమితి ఉప నాయకుడు, మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. ఆదివారం రాత్రి పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టిపిసి లోని శ్రీమయి కన్వెన్షన్ హాల్లో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో సింగరేణి పరిరక్షణ సదస్సు నిర్వహించారు.

కాంగ్రెస్ కు హటావో సింగరేణికి బచావో అన్న ప్రధాన నినాదంతో సాగిన ఈ సదస్సుకు మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్యఅతిథిగా హాజరై కార్మికులను ఉద్దేశించి సుదీర్ఘంగా మాట్లాడారు. సింగరేణి బొగ్గు పరిశ్రమలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు…. దోపిడి విధానాలు…. పరిశ్రమకు జరుగుతున్న కుట్రల వ్యవహారాలపై హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే సింగరేణి వ్యాప్తంగా 19 పైచిలుకు డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. గతంలో సింగరేణిలో ఉద్యోగాలు పోడగొట్టిన చంద్రబాబు బాటలోనే ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నడుస్తున్నాడని విమర్శించారు. సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలు తీసేసేందుకే రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తున్నాడని హరీష్ మండిపడ్డారు.

ఎన్ని అనారోగ్య సమస్యలు ఉండి మంచం పట్టిన వారిని సైతం ఫిట్ చేస్తూ అన్ఫిట్ చేయకుండా మెడికల్ బోర్డు వ్యవహరిస్తున్న తీరుపై హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బొగ్గు పరిశ్రమలో జరుగుతున్న కుంభకోణాల పరంపరపై ఖచ్చితంగా పోరాటం చేస్తామన్నారు. కాంగ్రెస్కు హటావో సింగరేణికు బచావో అంటూ హరీష్ రావు పెద్ద ఎత్తున నినాదించారు. ఎన్నో లాభాలను గడించిన సింగరేణి పరిశ్రమ ప్రస్తుతం బయట నుండి అప్పులు తీసుకొని సింగరేణి కార్మికులకు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితిని కాంగ్రెస్ తీసుకొచ్చింది అంటూ హరీష్ రావు ఈ సందర్భంగా గుర్తు చేశారు.

గతంలో 16% గా ఉన్న బోనస్ను కెసిఆర్ హయాంలో 32 శాతం బోనస్ ఇవ్వడం జరిగిందని చెప్పారు. భవిష్యత్తులో కాంగ్రెస్కు ప్రతిపక్ష హోదానే ఎక్కువ పరిస్థితి ఉందని మళ్లీ రాబోయేది కేసీఆర్ ప్రభుత్వమేనని తేల్చి చెప్పారు. సింగరేణి సంస్థను కాపాడుకునేందుకు రాజకీయాలకు అతీతంగా కలిసి రావాలని భారత రాష్ట్ర సమితి సింగరేణి సంస్థను కాపాడుకునేందుకు ఎంత పెద్ద ఉద్యమం చేయడానికి అయినా సిద్ధంగా ఉందని హరీష్ రావు ఈ సందర్భంగా తెగేసి చెప్పారు.

టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షులు, రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసిన సింగరేణి పరిశ్రమను కాపాడుకొని తీరుతామని… భవిష్యత్ జరిగే పోరాటంలో కార్మికులందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ సహాయం లో కొత్తగా ఒక్క బొగ్గు అని వచ్చింది లేదు.. ఒక్క ప్రాజెక్టు తెచ్చింది లేదని మండిపడ్డారు.

తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో మాజీ మంత్రి గంగుల కమలాకర్, మాజీ శాసనసభ్యులు కోరుకంటి చందర్, పుట్ట మధుకర్, దివాకర్ రావు, హుజురాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి, కార్మిక సంఘం ప్రతినిధులు మాదాసు రామ్మూర్తి, కాపు కృష్ణ, సురేందర్, నూనె కొమరయ్య, వడ్డేపల్లి శంకర్, శ్రీనివాస్ రెడ్డి తోపాటు వందలాది మంది కార్మికులు టీవీ జీకే ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply