కూటమి పాలనపై వైసీపీ టౌన్ సమావేశం
కూటమి పాలనపై వైసీపీ టౌన్ సమావేశం
పాయకాపురం, ఆంధ్రప్రభ: విజయవాడ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు విజయవాడ సెంట్రల్ మాజీ శాసనసభ్యుడు మల్లాది విష్ణు వర్ధన్ ఆధ్వర్యంలో కూటమి పాలనపై టౌన్ హాల్ సమావేశం వై. ఎస్ కన్వెన్షన్ హాలులో ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, డిప్యూటీ మేయర్ అవుతూ శ్రీశైలజ శ్రీనివాసరెడ్డి, గౌస్ మొయిద్దీన్,మ క్లస్టర్ ఇంచార్జి పసుపులేటి ఏసు, డివిజన్ అధ్యక్షులు రాజారెడ్డి, రామిరెడ్డి, జగదీష్, కురిటీ శివ, వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా నియోజకవర్గ మండల స్థాయి నాయకులు మాజీ కార్పొరేటర్లు మహిళా బీసీ యూత్ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఐటీ సోషల్ మీడియా మిగిలిన అన్ని అనుబంధ విభాగాల నాయకులు డివిజన్ ప్రెసిడెంట్ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
