4thJuneeditorial | మమత నాయకత్వంపై ఎమ్మెల్యేల అసంతృప్తి
4thJuneeditorial | మమత నాయకత్వంపై ఎమ్మెల్యేల అసంతృప్తి
4thJuneeditorial | 50 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటుతో టీఎంసీలో కలకలం
పార్టీ కమిటీల రద్దుతో మమత ప్రక్షాళన చర్యలు
అభిషేక్ బెనర్జీపై ఆరోపణలు.. ఈడీ విచారణ
కేంద్రంపై మమత వర్గీయుల రాజకీయ కక్ష ఆరోపణలు
4thJuneeditorial | పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీపై తిరుగుబాటు జరిగింది. అసెంబ్లీలో ఆమె పార్టీ సభ్యుల సంఖ్య 80 మంది కాగా, రితుబ్రత బెనర్జీ, సందీపన్లను ఆమె జూన్ 1వ తేదీన బహిష్కరించారు. ఇప్పుడు 50 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. ఆమె నాయకత్వంలో 22 మంది మాత్రమే మిగిలారు. దీంతో ఆగ్రహించిన ఆమె పార్టీని ప్రక్షాళన చేసేందుకు అన్ని స్థాయిల్లో కమిటీలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.
పార్టీని నెలకొల్పిన నాటి నుంచి మమతా మాటే శాసనంగా చెల్లుబాటు అవుతోంది. మూడు సార్లు పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన ఆమె.. తిరుగులేని నాయకురాలిగా పేరొందారు. పార్టీలోనూ, శాసనసభలోనూ తన బలం చూసుకుని జాతీయ స్థాయిలో ఎదిగేందుకు పావులు కదిపారు. ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఏర్పాటైన ఇండియా కూటమిలో చేరారు. కూటమికి నాయకత్వం తనకే వస్తుందని ఆశించారు. కానీ, కాంగ్రెస్ అందుకు అంగీకరించలేదు. ఇండియా కూటమిలోని ఇతర పార్టీలు ఆమె ధోరణి నచ్చకపోవడం వల్లనే విడిగా ఉంటున్నాయి.
రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో బీజేపీని ప్రధాన శత్రువుగా తీసుకుని ఆమె ఎన్నికల ప్రచారం సాగించారు. అలాగే, బీజేపీ కూడా ఆమెను ఓడించేందుకు శపథం చేసి దానిని నెరవేర్చుకుంది. ముఖ్యంగా, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఆమె తరచూ మాటల తూటాలకు దిగేవారు. సమగ్ర జనగణన సర్వే (ఎస్ఐఆర్) పేరిట రాష్ట్రంలో లక్షలాది ఓట్లను ఎన్నికల కమిషన్ తొలగించిందని ఆరోపిస్తూ ఆమె కేంద్రంపై దాదాపు యుద్ధాన్ని ప్రకటించారు. ఈ విషయమై ఆమె సుప్రీంకోర్టుకు వెళ్లారు. తమ రాష్ట్రం తరఫున తానే స్వయంగా వాదించారు. అయితే, ఎస్ఐఆర్ను సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది.

అధికారంలో ఉన్నప్పుడూ, తర్వాత ఆమె తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి అధిక ప్రాధాన్యం ఇవ్వడం వల్ల పార్టీలో అసంతృప్తి పెరిగింది. ఎమ్మెల్యేలలో అధికులకు ఆమె ధోరణి నచ్చలేదు. పార్టీలో తిరుగుబాటుకు నేపథ్యం ఇదే. అయితే, రితుబ్రత బెనర్జీ, సందీపన్ అనే ఇద్దరు ఎమ్మెల్యేలు నేరుగా ఆమెను విమర్శించడంతో వారిని ఆమె బహిష్కరించారు.
రితుబ్రత బెనర్జీ నేతృత్వంలో 50 మంది ఎమ్మెల్యేలు తామంతా విడిగా గ్రూపుగా ఏర్పడినట్టు స్పీకర్‌కు లిఖితపూర్వకంగా తెలియజేశారు. పార్టీలో చీలిక చట్టబద్ధం కావడానికి వీలుగా మూడింట రెండు వంతుల మందిని కూడగట్టారు. స్పీకర్ ఆ గ్రూపును అధికారికంగా గుర్తించారు. దాంతో ఆమె పార్టీని ప్రక్షాళన చేయడానికి అన్ని స్థాయిల్లో కమిటీలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. అనుబంధ సంస్థలను కూడా రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.
అభిషేక్ బెనర్జీ మమత అధికారంలో ఉన్నప్పుడు డబ్బు తీసుకుని ఉద్యోగాలను నియమించారన్న ఆరోపణలను పురస్కరించుకుని ఆయనపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ జరుపుతోంది. మొత్తంమీద మమత మీద రాజకీయ కక్షతో కేంద్రం ఈ కేసును తవ్వితీసిందని ఆమె వర్గీయులు ఆరోపిస్తున్నారు. అమిత్ షాను, ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఎదిరించడం వల్లనే ఆమెకు ఈ కష్టాలు వచ్చాయని కూడా వారు ఆరోపిస్తున్నారు.
ప్రతిపక్షాలకు చెందిన ముఖ్యమంత్రులనూ, నాయకులను లొంగదీసుకోవడానికి సీబీఐ, ఈడీలను ప్రయోగిస్తోందంటూ ఆమె కేంద్రంపై యుద్ధాన్ని ప్రకటించడం వల్లనే ఆమె ప్రస్తుత పరిస్థితికి కారణమని అనేవారు చాలా మంది ఉన్నారు. ఆమెను ఫైర్ బ్రాండ్‌గా అభివర్ణిస్తూ ఉంటారు. ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయో మరి.
