నూతన వధూవరులను ఆశీర్వదించిన ప్రముఖులు

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మాజీ జెడ్పిటిసి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బొట్ల పరమేశ్వర్–పద్మజల కుమారుడు అనీశ్వర్ వివాహం వలుస సుధాకర్–తిరుమలల కుమార్తె సౌమ్యతో శుక్రవారం ఘనంగా జరిగింది. మడికొండ, కాజీపేటలోని సత్యసాయి కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించిన ఈ వివాహ వేడుకకు పలువురు రాజకీయ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, బంధుమిత్రులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

Leave a Reply