Congress | కుటుంబ విభేదాల వల్లే కవిత పార్టీ

Congress | కుటుంబ విభేదాల వల్లే కవిత పార్టీ
Congress | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : బీఆర్‌ఎస్ పార్టీ ప్రస్తుతం తన రాజకీయ ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలో ఉందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు. వాటాల పంపకాల్లో వచ్చిన విభేదాల నుంచే కవిత కొత్త పార్టీ పుట్టిందని ఆరోపించారు.
కుమార్తె పెట్టిన కుంపటితో కేసీఆర్ బయటకు వస్తున్నారని, కవిత లేవనెత్తిన ప్రశ్నలకు కేసీఆర్, కేటీఆర్ నుంచి సమాధానం లేదని ఆయన దుయ్యబట్టారు. పదేళ్ల పాలనలో కేసీఆర్ ఎన్ని రెండు పడక గదుల ఇళ్లు ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి కేసీఆర్‌తో లోపాయికారి ఒప్పందం ఉందని కూడా మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. బీజేపీ-బీఆర్‌ఎస్ దోస్తీ వల్లే కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ జరగడం లేదన్నారు. తెలంగాణ ప్రజలు ఇప్పుడు బీఆర్‌ఎస్‌ను నమ్మే పరిస్థితిలో లేరని, కాంగ్రెస్ పార్టీ మాత్రమే రాష్ట్ర పునర్నిర్మాణానికి కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.
