DGP | శాంతిభద్రతల కోసం అహర్నిశలు కృషి చేస్తాం
DGP | శాంతిభద్రతల కోసం అహర్నిశలు కృషి చేస్తాం
DGP | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : శాంతిభద్రతల్లో సమస్యలు తలెత్తకముందే అప్రమత్తంగా ఉండటం ఎంతో ముఖ్యమని రాష్ట్ర నూతన డీజీపీ సీవీ ఆనంద్ అన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం అహర్నిశలు కృషి చేస్తామని, ప్రభుత్వ ఆశయాలు, ఆకాంక్షలు నెరవేరేలా పనిచేస్తామని హామీ ఇచ్చారు.
డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో సీవీ ఆనంద్ మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేశారు.
నేరాల దర్యాప్తులో తెలంగాణ పోలీసులు ఇప్పటికే ఉత్తమ పనితీరు కనబరిచారని ఆయన ప్రశంసించారు. సాంకేతికతను మరింత సమర్థంగా వినియోగిస్తూ పోలీసింగ్‌ను బలోపేతం చేస్తామని తెలిపారు. ప్రజలకు మరింత చేరువగా ఉండేలా పోలీస్ వ్యవస్థను తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో ఎలాంటి రాజీ ఉండదని డీజీపీ స్పష్టం చేశారు.
