Dehydration | ఇదిగో పండ్ల రసాల ప్రయోజనాలు..
Dehydration | ఇదిగో పండ్ల రసాల ప్రయోజనాలు..
Dehydration | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : మే నెల ఆరంభమైంది. భానుడు భగ్గుమంటున్నాడు. బయటకు వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఒకవేళ పని నిమిత్తం బయటక వెళ్లాల్సి వస్తే ఎండ వేడిమికి దాహంతో ప్రజల అల్లాడిపోతున్నారు. అలా ఎండలో తిరిగితే శరీరరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. ఎండ వేడి నుండి ఉపశమనం పొందడానికి చాలామంది శీతలపానాయాలను తాగడానికి ఇష్టపడతారు. అయితే ఈ సమయంలో తాజా పండ్ల రసాలు తాగడం ఎంతో మేలు చేస్తుంది. ఇవి అలసటను తగ్గించి, తక్షణ శక్తిని అందిస్తాయి. ఏ జ్యూస్‌లు తాగితే.. ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఒక్కసారి ఇప్పుడు చూద్దాం..
పుచ్చకాయ జ్యూస్ : శరీరాన్ని వెంటనే చల్లగా ఉంచుతుంది, దాహాన్ని తగ్గిస్తుంది.
నిమ్మరసం : విటమిన్ C ఎక్కువగా ఉంటుంది. దాహం, అలసట తగ్గిస్తుంది.
కొబ్బరి నీరు : నేచురల్ ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. డీహైడ్రేషన్‌ను తగ్గిస్తుంది.
మామిడి జ్యూస్ : శక్తిని ఇస్తుంది, హీట్ స్ట్రోక్ నుంచి కాపాడుతుంది.
దోసకాయ జ్యూస్ : శరీరాన్ని చల్లగా ఉంచి హైడ్రేషన్ ఇస్తుంది.
బెల్లం-పానకం : శరీరానికి శక్తి ఇస్తుంది, వేడి తగ్గిస్తుంది.
మజ్జిగ : జీర్ణక్రియకు చాలా మంచిది, శరీరాన్ని కూల్‌గా ఉంచుతుంది.
అయితే జ్యూస్‌లో ఎక్కువ చక్కెర వేసుకోవద్దని నిపుణులు చెబుతున్నారు. ఫ్రెష్‌గా అప్పటికప్పుడు తయారు చేసుకుని తాగడం మంచిది. వేసవిలో రోజుకు కనీసం 2–3 లీటర్లు ద్రవాలు తీసుకుంటే మేలు.
